Ads
ఎవరైనా ఏదైనా పని చేయాలంటే కచ్చితంగా ఏదో ఒక చోట నుండి మొదలు పెట్టాల్సిందే. ఆ తర్వాత మనం ఎంత ఎత్తుకు ఎదుగుతాము అనేది మన పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. మనం కష్టపడే విధానం, మనం ఆలోచించే తీరు ఇవన్నీ మనం ప్రస్తుతం ఉన్న చోటు నుండి ముందుకి కదలటానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
Video Advertisement
మన క్రికెటర్లు కూడా అలాగే ఎంతో కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళు కష్టపడి ఆడే తీరు వల్ల సమయం తో పాటు వాళ్లకు చెల్లించే మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. అలా వాళ్ల కెరీర్ ప్రారంభించిన తీసుకున్న మొత్తం కంటే దాదాపు వంద రెట్లు ఎక్కువ మొత్తం తీసుకుంటున్న టాప్ ఆరుగురు క్రికెటర్లు వీరే.
#1 మనీష్ పాండే
మొదటి శాలరీ – 6 లక్షలు
ప్రస్తుతం ఉన్న శాలరీ – 11 కోట్లు
మనీష్ పాండే ముంబై ఇండియన్స్ తరపున ఆడినప్పుడు అతనికి చెల్లించిన మొత్తం 6 లక్షలు. తర్వాత 2018 హైదరాబాద్ సన్ రైజర్స్ తరపున ఆడినప్పుడు మనీష్ పాండే కి 11 కోట్లు చెల్లించారు.
#2 హార్థిక్ పాండ్యా
మొదటి శాలరీ – 10 లక్షలు
ప్రస్తుతం ఉన్న శాలరీ – 11 కోట్లు
2015 లో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడారు హార్దిక్ పాండ్యా. అప్పుడు 10 లక్షల మొత్తానికి ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కి 11 కోట్లు చెల్లిస్తున్నారు.
#3 కే ఎల్ రాహుల్
మొదటి శాలరీ – 10 లక్షలు
ప్రస్తుతం ఉన్న శాలరీ – 11 కోట్లు
2013లో 10 లక్షల ఒప్పందానికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆడారు కె.ఎల్.రాహుల్. ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి కెప్టెన్ గా ఎంపికయ్యారు. 2018లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సభ్యులు కే ఎల్ రాహుల్ తో 11 కోట్లు మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.
#4 భువనేశ్వర్ కుమార్
మొదటి శాలరీ – 6 లక్షలు
ప్రస్తుతం ఉన్న శాలరీ – 8.5 కోట్లు
2009లో తన కెరీర్ ని మొదలు పెట్టారు భువనేశ్వర్ కుమార్. అప్పుడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడారు. 2014లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం భువనేశ్వర్ కుమార్ కి 8.5 కోట్ల మొత్తాన్ని చెల్లిస్తోంది.
#5 సంజు శామ్సన్
మొదటి శాలరీ – 8 లక్షలు
ప్రస్తుతం ఉన్న శాలరీ – 8 కోట్లు
2012లో కోల్కత్తా నైట్ రైడర్స్ తరపున సంజు శామ్సన్. అప్పుడు సంజు శామ్సన్ కి చెల్లించిన మొత్తం 8 లక్షలు. తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీం లోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇండియా లోని టాప్ వికెట్ కీపర్ లో ఒకరిగా ఉన్నారు సంజు శామ్సన్. 2020లో రాజస్థాన్ రాయల్స్ సంజు శామ్సన్ కి చెల్లిస్తున్న మొత్తం 8 కోట్లు.
#6 విరాట్ కోహ్లీ
మొదటి శాలరీ – 12 లక్షలు
ప్రస్తుతం ఉన్న శాలరీ – 17 కోట్లు
2008లో అండర్-19 కేటగిరిలో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ టీం తరపున ఆడారు విరాట్ కోహ్లీ. అప్పుడు విరాట్ కోహ్లీ కి చెల్లించిన మొత్తం 12 లక్షలు. ప్రస్తుతం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ యజమాన్యం విరాట్ కోహ్లీతో 17 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
End of Article