ఈ 8 ఐపీఎల్ టీం ల ఓనర్ లు ఎవరో తెలుసా? వారికున్న ఇతర బిజినెస్ లు ఏంటంటే.?

ఈ 8 ఐపీఎల్ టీం ల ఓనర్ లు ఎవరో తెలుసా? వారికున్న ఇతర బిజినెస్ లు ఏంటంటే.?

by Mohana Priya

Ads

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హవా. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ టీం కి ఆడే ప్లేయర్ ల గురించి మనకి తెలుసు. కానీ ఓనర్స్ లో కొంత మంది గురించి మాత్రం తప్ప మిగిలిన వాళ్ళ గురించి అంత పెద్దగా తెలియదు. ఐపీఎల్ ఓనర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

#1 కింగ్స్ ఎలెవన్ పంజాబ్

డాబర్ సంస్థ డైరెక్టర్ అయిన మోహిత్ బర్మన్, వాడియా గ్రూప్ కి చెందిన నెస్ వాడియా, PZNZ మీడియా అధినేత, నటి ప్రీతి జింటా, ఏపీజే సురేంద్ర గ్రూప్ కి చెందిన కరణ్ పాల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కి కో-ఓనర్స్. ప్రీతి జింటా ఫేస్ ఆఫ్ ద టీం గా, అన్నిచోట్ల కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ని ప్రజెంట్ చేస్తారు.

#2 ముంబై ఇండియన్స్

రిలయన్స్ గ్రూప్ కి చెందిన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్స్. ఇంకా వాళ్ళ కొడుకు ఆకాశ్ అంబానీ  కూడా జట్టు బాధ్యతలను చూసుకుంటారు. వీళ్లు చాలా యాక్టివ్ గా జట్టు యొక్క కార్యకలాపాలు చూస్తుంటారు, ఆఫ్ సీజన్ లో కూడా ముంబై ఇండియన్స్ జట్టు ఫంక్షనాలిటీ గురించి పూర్తి శ్రద్ధ వహిస్తారు.

#3 చెన్నై సూపర్ కింగ్స్

2008 లో ఇండియా సిమెంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేసింది. ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఎన్.శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బాధ్యతలను చూసుకుంటారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉంది.

#4 కోల్కతా నైట్ రైడర్స్

రెడ్ ఛిల్లీస్ అధినేత, ఇంకా నటుడు షారుఖ్ ఖాన్, అలాగే మెహతా గ్రూప్ కి చెందిన జై మెహతా, జుహీ చావ్లా 55 శాతం, 45 శాతం స్టేక్స్ తో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓనర్స్ గా ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఫేస్ అఫ్ ది టీం గా జట్టుని ప్రెజెంట్ చేస్తారు. మేనేజ్మెంట్ ఇంకా ఆక్షన్ బాధ్యతలు మెహతా గ్రూప్ చూసుకుంటారు.

#5 సన్ రైజర్స్ హైదరాబాద్

 

సన్ నెట్వర్క్ అధినేత అయిన కళానిధి మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఓనర్ గా ఉన్నారు. అంతకు ముందు డెక్కన్ ఛార్జర్స్ పేరుతో ఉన్న ఈ జట్టు 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారింది. డెక్కన్ ఛార్జర్స్ గా ఉన్నప్పుడు మొదటి టైటిల్, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారిన తర్వాత రెండవ టైటిల్ ని గెలుచుకుంది.

#6 ఢిల్లీ క్యాపిటల్స్

జిఎంఆర్ (గ్రంధి మల్లికార్జున రావు) గ్రూప్ కి, జేఎస్డబ్ల్యూ (జిందాల్ సౌత్ వెస్ట్) గ్రూప్ కి ఢిల్లీ క్యాపిటల్ జట్టులో సమానమైన షేర్స్ ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ కి డైరెక్టర్ అయిన పార్థ్ జిందాల్ ఈ జట్టుకి డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే ఆక్షన్ లో పాల్గొనడంతో పాటు జట్టు కార్యకలాపాలను కూడా నిర్వహిస్తారు.

#7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కి చెందిన ఆనంద్ కృపాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓనర్ గా ఉన్నారు. అంతకు ముందు ఓనర్ గా విజయ్ మాల్యా ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల విజయ్ మాల్యా ఓనర్ స్థానం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

#8 రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ జట్టు కి మొత్తం ఆరుగురు కో-ఓనర్స్ ఉన్నారు. ట్రెస్కో ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ కు చెందిన అమిషా హాథీరామని, ఎమర్జింగ్ మీడియా లిమిటెడ్ కు చెందిన మనోజ్ బాదాలే, బ్లూ వాటర్ ఎస్టేట్ లిమిటెడ్‌కు చెందిన లాచ్లాన్ ముర్డోచ్, కుకి ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ ‌కి చెందిన రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, మాజీ క్రికెటర్ షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కి కో-ఓనర్స్ గా ఉన్నారు.

షేన్ వార్న్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్రాండ్ అంబాసిడర్ గా, శిల్పా శెట్టి ఫేస్ ఆఫ్ ది ఫ్రాంచైజ్ గా ఉన్నారు. అంతకు ముందు జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో కొంచెం వివాదాలను ఎదుర్కొన్నారు.

 


End of Article

You may also like