పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగనాస్ జిల్లాలోని బారాబజార్ ప్రాంతంలో ఒక మహిళ నైట్‌గౌన్ ధరించి డన్‌లాప్ వీధుల్లో తిరుగుతున్నారు. ఆ మహిళ ఫుట్‌పాత్‌పై పడుకుంటూ, అక్కడే వెళ్తున్న వారి నుండి ఆహారం తీసుకుని తింటున్నారు. ఆ మహిళ మరెవరో కాదు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కి మరదలు అవుతారు.Ira Basu sister-in-law of Buddhadeb Bhattacharya

ఇరా బసు అనే ఆ మహిళ బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరాకి సోదరి అవుతారు. ఇరా బసు బెంగాలీ, ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలుగుతారు. వైరాలజీలో పిహెచ్‌డి చేశారు. ఇరా బసు రాష్ట్రస్థాయి అథ్లెట్, అలాగే టేబుల్ టెన్నిస్, క్రికెట్ కూడా ఆడేవారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలోని ప్రియనాథ్ గర్ల్స్ హై స్కూల్ లో లైఫ్ సైన్సెస్ టీచర్ గా చేసేవారు. కానీ గత రెండు సంవత్సరాలుగా ఫుట్‌పాత్‌పై నివసిస్తున్నారు.Ira Basu sister-in-law of Buddhadeb Bhattacharya

ఆమె అలా అయిపోవడానికి గల కారణం ఏంటో ఎవరికీ తెలియదు. ఇరా బసు 1976లో స్కూల్ టీచర్ గా చేరారు. జూన్ 28, 2009 లో రిటైర్ అయ్యారు. ఆ సమయానికి బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గానే ఉన్నారు. ఇరా బసు కండిషన్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, అక్కడి ఉన్నతాధికారులు స్పందించి ఆవిడని పోలీస్ స్టేషన్ కి తరలించారు.Ira Basu sister-in-law of Buddhadeb Bhattacharya

ఆ తర్వాత మెడికల్ చెకప్ కోసం కోల్‌కతాలోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇరా బసు కి ఇప్పటికి కూడా ప్రస్తుతం ఉన్న టీచింగ్ విధానం పై బలమైన అభిప్రాయం ఉంది. ఆన్‌లైన్ తరగతులని తాను సపోర్ట్ చేయను అని, స్టూడెంట్స్ దీని వల్ల ఇబ్బందులు పడుతున్నారు అని, ప్రాక్టికల్ గా ఏది నేర్చుకోలేకపోతున్నారు అని అన్నారు.