Ads
రైలులో దూర ప్రాంతాలు ప్రయాణించే ప్రయాణికులు ఆహారం కోసం రైల్వే క్యాటరింగ్ లో బుక్ చేసుకుంటూ ఉంటారు. ఆ రైళ్లలో ఉండే కిచెన్ లోనే వండి ప్రయాణికులకు భోజనాన్ని అందిస్తారు. ఎప్పుడూ ప్రయాణికులకు పంపిణీ చేసే ఆహార పదార్థాలపై తరచూ ఫిర్యాదులు వస్తూ ఉంటాయి.
Video Advertisement
ఆహారా నాణ్యత బాగాలేదని, ఏమో పదార్థాలు కలిసాయని ఫిర్యాదులు అందుతూ ఉంటాయి. ఇటీవల ఓ రైలు వంటగదిలో కనిపించిన దృశ్యం ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తుంది. ఆ రైలు కిచెన్ లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
టెండూల్కర్ అనే వ్యక్తి ఇటీవల తన కుటుంబంతో కలిసి మడగావ్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించారు. ఆ రైల్లోని కిచెన్ వైపుగా ఎలకలు వెళ్లడాన్ని అతను గమనించాడు. అతను వెళ్లి చూడగా ఆహార పాత్రలపై రెండు ఎలుకలు తిరగడంతో పాటు అందులోని పదార్థాలను తింటున్నాయి. దీంతో వెంటనే ఆ దృశ్యాలను తన ఫోన్ లో రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
“రైలు పాంట్రీలో దాదాపు 7 ఎలకలు ఆహార పాత్రలపై తిరుగుతూ కనిపించాయి” అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ పైన IRCTC స్పందించింది.ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం కిచెన్ను పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బందికి అవగాహన కల్పించి మళ్లీ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఇలాంటి ఘటనలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాము టిక్కెట్ తో పాటు డబ్బు వెచ్చించి భోజనాన్ని బుక్ చేసుకుంటున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Also Read:ఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?
End of Article