Ads
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ఈరోజు మరణించారు. ఆయన వయసు 54 . మొన్నటి వరకు విచిత్రమైన కాన్సర్ వ్యాధితో పోరాడి ఈ మధ్యే భారత్‌కు వచ్చాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఇటీవలె ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం ఏప్రిల్ 25 ఉదయం కన్ను మూసారు. ఆయన మరణ వార్త ఇండస్ట్రీలో అందరిని కన్నీటిపర్యంతం చేసింది.
Video Advertisement
ప్రముఖ దర్శకులు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘సైనికుడు’ సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది.అందులో నటించిన విలన్ ఇర్ఫాన్ ఖాన్..నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.బాలీవుడ్ లో స్టార్ హీరో గా పేరుని సంపాదించుకున్న ఇర్ఫాన్ ఖాన్.తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పటికి గుర్తు ఉండే ఉంటారు.బాలీవుడ్ లో ఇర్ఫాన్ చేసిన ‘ది లై అఫ్ పై’ స్లం డాగ్ మిలెనినియర్ చిత్రాలకి జాతీయ స్థాయిలో అవార్డులు రాగా పలు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.
ఆయన మరణించారని తెలియగానే దేశమంతా ఒక్కసారిగా మూగబోయింది. ట్విట్టర్ లో సంతాపం తెలిపారు సినీ ప్రముఖులు. ఈ క్రమంలో ఆయన నటించిన హాలీవుడ్ చిత్రం ‘లైప్ ఆఫ్ పై’లో పుట్టుక, మరణాలపై మాట్లాడిన సన్నివేశాన్ని ట్వీట్ చేస్తూ ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు.
‘”మరణం మన జీవితాన్ని ముగిస్తుందని నేను ఏప్పడు అనుకుంటాను. అయితే బాధకరమైన విషయం ఎంటంటే కనీసం వీడ్కోలు చేప్పెటప్పుడు అది ఒక్క క్షణం కూడా తీసుకోదు” అని చెప్పిన సన్నివేశానికి ‘‘మిమ్మలను మిస్ అవుతున్నాము సార్.. వీ లవ్ యూ’’ అనే క్యాప్షన్‌తో ఓ అభిమాని ట్వీట్ చేశాడు. ‘‘ఆయన సినిమాలో చెప్పిన ఈ మాటలు దురదృష్టవశాత్తు ఈ రోజు సరిగ్గా సరిపోతాయి’’ ‘‘ఇన్ని రోజులు పోరాటం చేశారు.. ఇప్పుడు ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉందని ఆశిస్తున్నాం’’ అంటూ నెటిజన్లు భావోద్యేగంతో కామెంట్లు పెడుతున్నారు.
Scene from “LIFE OF PI”
“I suppose in the end, the whole of life becomes an act of letting go, but what always hurts the most is not taking a moment to say goodbye”
We love and will miss you #IrrfanKhan. #ripirfankhan pic.twitter.com/BFz0kRGhis
— Devil V!SHAL (@VishalRC007) April 29, 2020
End of Article