Ads
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ఈరోజు మరణించారు. ఆయన వయసు 54 . మొన్నటి వరకు విచిత్రమైన కాన్సర్ వ్యాధితో పోరాడి ఈ మధ్యే భారత్‌కు వచ్చాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఇటీవలె ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం ఏప్రిల్ 25 ఉదయం కన్ను మూసారు. ఆయన మరణ వార్త ఇండస్ట్రీలో అందరిని కన్నీటిపర్యంతం చేసింది.
Video Advertisement
కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ హాస్పిటల్ లో 29 ఏప్రిల్ నాడు తుది శ్వాస విడిచారు ఇర్ఫాన్ ఖాన్. అతని ఇద్దరి కుమారులు నిన్న అంతిమ సంస్కారం నిర్వహించారు. హాస్పిటల్ లో ఉండగా ఆయన చెప్పిన చివరి మాటలు ఇప్పుడు అందరికి కంటతడి పెట్టిస్తున్నాయి. “నన్ను తీసుకెళ్లడానికి అమ్మ వచ్చింది” అని చివరగా ఇర్ఫాన్ ఖాన్ అన్నారు అంట.
గత శనివారమే అతడి తల్లి సయిదా బేగం.. రాజస్థాన్‌లోని జైపుర్‌లో కన్నుమూశారు. మన దగ్గర లాక్డౌన్ నిబంధనలు అమలవుతుండటంతో ఇర్ఫాన్ తన తల్లిని కడసారి కూడా చూడలేకోయాడు. తల్లి అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారానే ఇర్ఫాన్ చుశారని అతడి స్నేహితులు తెలిపారు. తల్లి మరణించే నాలుగు రోజులకే ఇర్ఫాన్ ఖాన్ మరణించడంతో అమ్మను వదిలి 4 రోజులైనా ఉండలేకపోయావా ఇర్ఫాన్ అంటూ కంటతడి పెడుతున్నారు అభిమానులు.
ఆయన మరణించారని తెలియగానే దేశమంతా ఒక్కసారిగా మూగబోయింది. ట్విట్టర్ లో సంతాపం తెలిపారు సినీ ప్రముఖులు. ఈ క్రమంలో ఆయన నటించిన హాలీవుడ్ చిత్రం ‘లైప్ ఆఫ్ పై’లో పుట్టుక, మరణాలపై మాట్లాడిన సన్నివేశాన్ని ట్వీట్ చేస్తూ ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు.
“మరణం మన జీవితాన్ని ముగిస్తుందని నేను ఏప్పడు అనుకుంటాను. అయితే బాధకరమైన విషయం ఎంటంటే కనీసం వీడ్కోలు చేప్పెటప్పుడు అది ఒక్క క్షణం కూడా తీసుకోదు” అని చెప్పిన సన్నివేశానికి ‘‘మిమ్మలను మిస్ అవుతున్నాము సార్.. వీ లవ్ యూ’’ అనే క్యాప్షన్‌తో ఓ అభిమాని ట్వీట్ చేశాడు. ‘‘ఆయన సినిమాలో చెప్పిన ఈ మాటలు దురదృష్టవశాత్తు ఈ రోజు సరిగ్గా సరిపోతాయి’’ ‘‘ఇన్ని రోజులు పోరాటం చేశారు.. ఇప్పుడు ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉందని ఆశిస్తున్నాం’’ అంటూ నెటిజన్లు భావోద్యేగంతో కామెంట్లు పెడుతున్నారు.
End of Article