పుష్ప 2 కోసం… “బన్నీ” మరొక రిస్క్ తీసుకోబోతున్నారా..?

పుష్ప 2 కోసం… “బన్నీ” మరొక రిస్క్ తీసుకోబోతున్నారా..?

by Megha Varna

Ads

“పుష్ప: ది రైజ్” సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

Video Advertisement

ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక ఈ సినిమా రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” పైన అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.

byunny fans fire on mythri movie makers..

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్లలో ఒకరైన అవినాష్ గోవరికర్ ఈ సినిమా కోసం పని చేస్తుండటం గమనార్హం. అయితే పుష్ప ది రైజ్ మూవీ కూడా ఇదే విధంగా ఫోటోషూట్ తో మొదలైంది. ఆ సెంటిమెంట్ ను బట్టి పుష్ప ది రూల్ మూవీ విషయంలో కూడా బన్నీ ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.

ఈ సినిమా కూడా అంచనాలను మించి సక్సెస్ సాధించడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప2 మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే బన్నీ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అలానే దాదాపుగా 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పుష్ప: ది రైజ్ గత డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు పుష్ప 2కి కూడా సుకుమార్, బన్నీ ‘డిసెంబర్’ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ పుష్ప 2ని డిసెంబర్ 2023 లో థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బన్నీ లుక్ పుష్ప ది రూల్ లో మారనున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో చూస్తే పక్కా మాస్ లాగ యాక్ట్ చేసారు బన్నీ. అయితే పుష్ప 2లో మాత్రం స్టైలిష్ స్టార్ స్టైలిష్ అండ్ క్లాస్ డాన్ గా కనపడనున్నట్టు తెలుస్తోంది. సిండికేట్ డాన్ ఎదిగాడు కనుక ఆ మాత్రం స్టైల్ ఉండాలి. మొదటి పార్ట్ లో లాగ కాకుండా పాత్ర మరియు లుక్స్ రెండో పార్ట్ లో వేరేగా ఉంటాయట. ఈ కొత్త లుక్ తో మరి బన్నీ మరొక రిస్క్ తీసుకోబోతున్నారా..?


End of Article

You may also like