Ads
ఐపీఎల్ 20 20 మొదలవడానికి ఇంకా 19 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి కీలకమైన సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో దాదాపు 12-13 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో ఇద్దరు క్రికెటర్లు దీపక్ చాహర్ ఇంకా ఋతు రాజ్ గైక్వాడ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరు ఐసోలేషన్ లో ఉన్నారు.
Video Advertisement
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ సురేష్ రైనా శనివారం నాడు భారతదేశానికి తిరిగి ప్రయాణం అయ్యారు. ఇందుకు కారణం సురేష్ రైనా వ్యక్తిగత సమస్యలట. జాగరణ్ కథనం ప్రకారం సురేష్ రైనా బంధువుల లో ఒకరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారట.
పటాన్ కోట్ లోని థరియాల్ లో నివసించే ఇంకొక బంధువుపై దాడి జరిగిందట. దెబ్బలు బాగా తగలడంతో సురేష్ రైనా బంధువు మరణించారట. సురేష్ రైనా తండ్రి సోదరి అయిన ఆశా దేవి ఆరోగ్యం విషమంగా ఉందట. అంతేకాకుండా సురేష్ రైనా ఇండియాకి తిరుగు ప్రయాణం అవ్వడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో కొంతమందికి కరోనా సోకడం, అంతేకాకుండా సురేష్ రైనా కి రిప్లేస్మెంట్ ప్లేయర్ కూడా దొరకడం అనేది చాలా కష్టమైన విషయం కావడంతో ప్రస్తుతం బిసిసిఐ ఆందోళనలో ఉంది.
క్రిక్ ట్రాకర్ కథనం ప్రకారం ఈ మంగళవారం హర్భజన్ సింగ్ దుబాయ్ కి బయలుదేరాలి ఉందట. కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఉన్న వాళ్లకి కరోనా పాజిటివ్ రావడంతో కొంచెం భయపడుతున్నారట. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల హర్భజన్ సింగ్ షెడ్యూల్ అయినా మార్చుకుంటారట.
లేదా ఈసారి ఐపీఎల్ నుండి దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయట. ఒకవేళ నిజంగా ఇలాగే కనుక జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. క్వారంటైన్ లో ఉండడం వల్ల మిగిలిన టీం లతో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ కూడా చేయలేదు.
అలాగే మరి కొంతమంది ఫారిన్ సీనియర్ క్రికెటర్లు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి భయపడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. శ్రీనివాసన్ అవుట్ లుక్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాంచైజ్ గురించి, సురేష్ రైనా గురించి మాట్లాడారు. అంతేకాకుండా ఇలాంటి సమస్యలు టీం మొత్తంపై ప్రభావం చూపుతాయని అన్నారు.
End of Article