Ads
సుమారు ఏడు నెలలుగా కరోనా వైరస్ కి మందు కనుక్కోవడానికి ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు..ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది.. ఈ నేపధ్యంలో కరోనాకి మందు కనిపెట్టాం అంటూ పతంజలి సంస్థ ప్రకటన చేసింది..కానీ మరుసటి రోజే ఆ మందుకు బ్రేక్ వేసింది ఆయుశ్ సంస్థ..
Video Advertisement
కరోనాకి కొరోనిల్ ( Coronil tablets ) అనే ట్యాబ్లెట్స్ ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది పతంజలి.. ఈ మాత్రలను 5-14 రోజులు వాడాలని వారం రోజుల్లో కరోనా లక్షణాలు తగ్గి పోతాయిన పేర్కొంది..అయితే కానీ కొరోనిల్ అమ్మడాన్ని ఆపివేయాలని. కోరినిల్ మందును తయారుచేయడానికి వాడిన ముడిపదార్థాలు ఏంటి??, కంపోజిషన్ , దాన్ని ఎక్కడ పరీక్షించారు వంటి వివరాలు వెంటనే సమర్పించాలని పతంజలికి ఆయుష్ ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు దానికి సంబంధించిన ప్రకటణలు ఇవ్వకూడదంటూ ఆయుష్ మంత్రిత్వశాక, ICMR ప్రకటణ చేసింది.కొరినిల్ ని శాస్త్రీయంగా అనుమతించలేదని పేర్కొంది..అసలు కొరోనీల్ కి అనుమతి ఎవరిచ్చారు అనే విషయంపై విచారణ జరుగుతుంది.ఇదే విషయంపై ఉత్తరాఖండ్ ఆయుర్వేదశాఖ అధికారులను కోరితే ఆసక్తికర విషయం బయటపడింది.
అసలు పతంజలి వాళ్లు మందుని అప్రూవ్ చేయాలని అప్లై చేసుకున్నప్పుడు అది కరోనాకి మందు అని చెప్పనేలేదట.. కేవలం రోగనిరోదక శక్తిని పెంచుతుంది..దగ్గుని,జలుబుని తగ్గిస్తుంది అని మాత్రమే చెప్పారట..దాంతో అనుమతిని ఇచ్చారంట అది అసలు విషయం..
నిన్న మొన్నటి వరకు కరోనాకి మందులేదు..కానీ నేడు రోజుకో మందు మార్కెట్లోకి విడుదలవుతోంది..మైల్డ్ గా కరోనా లక్షణాలకు మా మందు పని చేస్తుందంటూ గ్లెన్ మార్క్ ఫాబిఫ్లూ టాబ్లెట్స్ ని మార్కెట్లోకి విడుదల చేయగా.. మరుసటి రోజే హెటిరో వారి మందు..తర్వాత రోజు అతి చవకైన ధరకే కరోనాకి మందు అంటూ పతంజలి వారి కరోనిల్..ఇప్పుడు ఈ వివాదంతో..అసలు ఈ మందులు నిజంగా కరోనాకి పనిచేస్తాయా..వ్యాపారం కోసం వీళ్లు ఇలాచేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
End of Article