రాహుల్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? తనతో ఉన్న ఆ యువతి ఎవరు?

రాహుల్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? తనతో ఉన్న ఆ యువతి ఎవరు?

by Sainath Gopi

Ads

బిగ్ బాస్ విన్నర్ “రాహుల్” పై  అర్థరాత్రి దాడి, అర్థరాత్రి గచ్చిబౌలిలోని  ఓ పబ్ వెళ్లిన రాహుల్ పై గొడవ జరిగింది, రాత్రి 11:45 గంటలప్పుడు రాహుల్ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వచ్చారు.అక్కడ రాహుల్ వెంట ఉన్న ఒక స్నేహితురాలితో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు  దీంతో రాహుల్ సిప్లిగంజ్ తన కు వారికీ మధ్య మాటా మాటా పెరిగింది. రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడ్డారు.రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి చేశారు. బీరు సీసాలతో కొట్టడంతో అయన తీవ్రంగా గాయపడ్డారుఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాహుల్ చికిత్స తీసుకున్నాడు. చిన్న గాయమే అంటూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకుంటున్నారు.

Video Advertisement

రాహుల్ సిప్లిగంజ్ పై నిన్న రాత్రి గచ్చిబౌలి ప్రిజమ్ పబ్‌లో జరిగిన దాడిలో రాహుల్‌కు తీవ్ర రక్త స్రావం అయింది. దీంతో పబ్ సిబ్బంది రాహుల్‌ను వెంటనే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతన్ని పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు ఆటను సేఫ్ గా ఉన్నాడు. దాడి చేసిన వారిలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంధువులు ఉన్నారు అని ఓ వార్త వచ్చింది.

సరైన సమయంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో గొడవలు సద్దుమణుగాయి. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్ళిపోయిన రాహుల్ . అయితే రాహుల్ మాత్రం కేసు పెట్టకుండానే తిరుగు ముఖం పట్టారు. దీంతో ఈ ఘటనపై రాహుల్ ఎందుకు ఫిర్యాదు చేయలేదనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ వైపు కూడా ఏమైనా తప్పు ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పబ్‌లో వేరే వాళ్లతో కావాలనే గొడవ పడ్డడా అందుకే వాళ్లు అతనిపై బీరు బాటిల్‌తో దాడి చేసారా అనే అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. అంతేకాకుండా రాహుల్ తో ఉన్నది ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియలేదు. రాహుల్‌ వెంట ఉన్నది పునర్నవి లేదా వేరే ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.


End of Article

You may also like