FACT CHECK: ఆ ఫొటోలో జయలలిత పక్కనున్నది నిర్మల సీతారామన్ కాదు..! మరెవరో తెలుసా?

FACT CHECK: ఆ ఫొటోలో జయలలిత పక్కనున్నది నిర్మల సీతారామన్ కాదు..! మరెవరో తెలుసా?

by Megha Varna

Ads

దివంగత జయలలిత, ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ అంటూ,వారి స్నేహం ఈనాటిది కాదు అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరలవుతోంది..ఆ ఫోటొలో జయలలిత పక్కన ఉన్న మహిళ పోలికలు కొంచెం నిర్మలా సీతారామన్ లానే ఉన్నాయి.. నిర్మలా సీతారమన్ ది కూడా తమిళనాడే ,రాజకీయ నేపధ్యం కావడంతో నిజమేనేమో అంటూ అందరూ శేర్ చేసారు..నిజానికి ఆ ఫోటోలో ఉన్నది నిర్మలా సీతారామన్ కాదు.. మరెవరు అనేది ప్రశ్న.

Video Advertisement

నిర్మలా సీతారామన్ కి, జయలలితకి ఇంచుమించు వయసులో పదేళ్లు వ్యత్యాసం..జయలలిత ఫిబ్రవరి 24,1948లో జన్మిస్తే,నిర్మలా సీతారామన్ ఆగస్ట్18,1959లో జన్మించారు.. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫొటో చూస్తే వారిద్దరూ సమవయస్కుల్లా ఉన్నారు..అసలు ఆ ఫోటోలో ఉన్నది నిర్మలా సీతారామన్ ఏనా, వీరిద్దరికి దోస్తీ ఎక్కడ కుదిరింది అని సెర్చ్ చేస్తే..అందులో ఉన్న మహిళ నిర్మల కాదని తెలిసింది.ఆవిడ తమిళ రచయిత్రి శివశంకరి.. శివశంకరి, జయలలిత స్నేహితులు.

ఐదేళ్ల క్రితం For the love of saree అనే ఒక ఫేస్ బుక్ ఫేజ్ వాళ్లు ఈ ఫోటోని శేర్ చేశారు.. When soft printed silks with a buttery feel were in vogue… Most of our mothers had one.. అంటూ క్యాప్షన్ తో పోస్టు చేయబడిన ఆ పోస్టులో, తమిళ నాడు సిఎం జయలలిత, ప్రముఖ రచయిత్రి శివశంకరి అంటూ..ఆ ఫోటో కింద పేర్లను కూడా మెన్షన్ చేశారు..వారిద్దరివి రకరకాల ఫోటోలు మనకు  జయలలిత ఇమేజ్ గ్యాలరీలో దర్శనం ఇస్తాయి..

మొత్తానికి ఆ ఫోటో లో ఉన్నది నిర్మలా సీతారమన్ కాదు.. నిర్మలా సీతారమన్ అప్పుడెలా ఉన్నారు.. శివశంకరి లేటెస్ట్ పిక్ రెండూ చూసి..మీరు ఒకసారి పోల్చిచూడండి.. ఆ ఫొటోలో ఉన్నది శివశంకరినా, నిర్మలా సీతారామన్ ఆ అనేది..

 


End of Article

You may also like