Ads
శ్రీ ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారు నిన్న మధ్యాహ్నం స్వర్గస్థులయ్యారు. బాలు గారు జూన్ 4 న , 1946 లో జన్మించారు. గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా కూడా ఎంతో పేరు సంపాదించారు బాలు గారు. సినీ సంగీతం లో ఆయన కృషి ని ప్రశంసిస్తూ జాతీయ ప్రభుత్వం 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. బాలు గారు ఆరు సార్లు జాతీయ స్థాయి లో ఉత్తమ గాయకుడిగా అవార్డును అందుకున్నారు.
Video Advertisement
కొద్ది రోజుల క్రితం తనకి కరోనా పాజిటివ్ వచ్చింది అని, ట్రీట్మెంట్ తీసుకోబోతున్నాను అని, త్వరలోనే మళ్ళీ మామూలు గా అవుతాను అని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు బాలు గారు. తర్వాత ఒక సమయంలో బాలు గారి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది అనే వార్తలు వచ్చాయి. కానీ తర్వాత బాలు గారికి కరోనా నెగిటివ్ వచ్చింది అనడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అప్పటి నుంచి ఎస్పీ చరణ్, బాలు గారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ అప్డేట్ ఇచ్చారు. కానీ సెప్టెంబర్ 24వ తేదీన బాలు గారి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉంది అని ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం ఒక రిపోర్ట్ విడుదల చేసింది. తర్వాత బాలుగారు లేదన్న వార్తని నిన్న మధ్యాహ్నం చెప్పారు.
ఇది ఇలా ఉండగా tv5 వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. tv5 కథనం ప్రకారం బాలు గారు ఒక షో కి అటెండ్ అయ్యారు. ఈ షోలో యాంకర్ మాస్క్ వేసుకోలేదు. తర్వాత బాలు గారు మాస్క్ తీసేసారు. మాస్క్ లేకుండా యాంకర్ తో మాట్లాడారు. అలవాటు ప్రకారం ముక్కు నోరు తాకారు. ఈ వీడియో చూసిన వారు బహుశా బాలు గారికి కరోనా సోకడానికి కారణం ఇక్కడే మొదలైంది ఏమో అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. బాలు గారి మరణం పై ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
watch video:
End of Article