Ads
అన్ని దేశాల్లో కరోనా ప్రభావం ముందు ఉన్నంతగా అయితే లేదు. జాగ్రత్తలు తీసుకుంటూనే పనులు మళ్లీ మెల్లగా మొదలుపెట్టుకుంటున్నారు. అంతకుముందు లాగా కాకపోయినా పనులు అయితే మొదలయ్యాయి. కానీ ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది.
Video Advertisement
మనమందరం కరోనా పూర్తిగా నయం అయితే మళ్లీ అన్నీ మామూలు అయిపోతాయి అనుకుంటున్నాం. కానీ ఒకసారి అందరం కరోనా భయం నుండి బయటపడ్డ తర్వాత వచ్చే సమస్యలు కూడా తక్కువగా ఏమీ లేవు.
మనదేశంలో అతి పెద్ద సమస్య నిరుద్యోగం. కరోనా తర్వాత ఎక్కువగా ప్రభావం పడేది కూడా ఎంప్లాయిమెంట్ సెక్టార్ మీదే. అంతకుముందు వేరే ప్రాంతానికి ఉద్యోగానికి వెళ్ళాలి అంటే ఎక్కువగా ఆలోచించే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎక్కువమంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు.
అందుకే ఎంతోమంది ప్రస్తుతానికి తాము ఉన్న ప్రదేశం లోనే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ముందు నుండి ఉద్యోగం ఉన్న వాళ్లు అయితే భవిష్యత్తులో శాలరీ పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది అనేది చెప్పలేని విషయం. ఎందుకంటే కరోనా వల్ల చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు మాత్రమే కాకుండా పెద్ద సంస్థలు, అలాగే మల్టీ నేషనల్ సంస్థలు కూడా ఆర్థికంగా వెనకబడ్డాయి.
వ్యవసాయం ఎక్కువగా జరిగే సీజన్ కూడా అయిపోవడంతో ఎంతో మంది రైతులు వేరే ప్రాంతాలకు వలస వెళ్తారు. రోజు వారి ఉద్యోగం పై కూడా కరోనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఆలోచిస్తూ ఎంతో మంది కరోనా కారణంగా మానసిక ప్రశాంతత కూడా కోల్పోయారు.
అంతకుముందు నిరుద్యోగం ఎక్కువగా భారతదేశం లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా, ఇంకా ఇతర ప్రదేశాల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు రావడంతో ప్రతి చోటా ఉద్యోగ అవకాశాలు అంత సులువుగా లభించకపోవచ్చు. దీనిపై ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందా? లేదా మనమే కొత్త అవకాశాలు సృష్టించుకొని ముందుకెళ్లాలా? ఈ ప్రశ్నలన్నిటికీ రాబోయే కాలమే సమాధానం చెప్పాలి.
End of Article