Home Filmy Adda ఆ ఒక్క “టైటిల్” కోసం… “ఎన్టీఆర్, కృష్ణ”ల మధ్య ఇంత గొడవ జరిగిందా..?

ఆ ఒక్క “టైటిల్” కోసం… “ఎన్టీఆర్, కృష్ణ”ల మధ్య ఇంత గొడవ జరిగిందా..?

by Mohana Priya

సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. నిజానికి అన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.

అంతకుముందు హీరోలందరూ స్నేహితులలాగా ఉండేవారు. స్టార్ ఇమేజ్, పాపులారిటీ ఇవన్నీ పక్కన పెట్టేసి అందరం ఒకటే అన్నట్టుగా ఉండేవారు. అలాగే ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కూడా మంచి స్నేహితులు.

issue between sr ntr and krishna for a movie title

అలాంటిది వారిద్దరి మధ్య ఒక విషయంపై చర్చ జరిగింది. వివరాల్లోకి వెళితే, కృష్ణ తన మొదటి కొడుకు అయిన రమేష్ బాబు హీరోగా సామ్రాట్ అనే టైటిల్ తో సినిమాని నిర్మించారు. ఇది రమేష్ బాబు మొదటి సినిమా. బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సామ్రాట్ అనే సినిమా ఒకటి చేశారు. రెండు సినిమాల పేర్లు ఒకటే అవ్వడంతో డైరెక్ట్ గా ఎన్టీఆర్, కృష్ణ ఈ విషయంపై చర్చించుకున్నారు.

issue between sr ntr and krishna for a movie title

ఇద్దరి మధ్య వివాదం జరిగింది అనే వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ఎన్టీఆర్ ఈ టైటిల్ ని కృష్ణకి ఇచ్చేశారు. బాలకృష్ణ నటించిన సినిమా పేరు సాహస సామ్రాట్ గా మార్చారు. బాలకృష్ణ నటించిన సాహస సామ్రాట్ యావరేజ్ గా నిలిచింది. కానీ రమేష్ బాబు హీరోగా నటించిన సామ్రాట్ మాత్రం హిట్ అయ్యింది. అలా వీరిద్దరి మధ్య ఈ విషయంపై వివాదం జరిగింది అని అంటుంటారు.

You may also like