కన్నీరు పెట్టుకున్న ఇటలీ అధ్యక్షుడు…ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కధ ఏమిటంటే?

కన్నీరు పెట్టుకున్న ఇటలీ అధ్యక్షుడు…ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కధ ఏమిటంటే?

by Megha Varna

సోషల్ మీడియా లో ఏది వచ్చినా అది నిజామా ,అబద్దమా అని ఆలోచించకుండా షేర్ చేస్తారు ,గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా లో ఒక ఫేక్ న్యూస్ విస్తృతంగా చలామణీ అవుతోంది. ఆ వార్త ఏమిటి అంటే… కన్నీరు పెట్టుకున్న ఇటలీ అధ్యక్షుడు అనే వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.,ఆ దేశంలో రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పెరుకుపోతున్న శవాలు,శవాలు పూడ్చడానికి స్థలాలు లేక అసలు వాళ్ళను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు అని.. అది చూడలేక ఆ దేశ అధ్యక్షుడే ఇక ఎవరిని కాపాడలేం అని చేతులెత్తేసి బోరున విలపించాడు అని వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫోటో వెనకున్న అసలు కథ ఏంటో చూద్దాము.ఆ ఫోటోలో ఉంది ఇటలీ అధ్యక్షుడు కాదు,తను బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో అనేది అసలు ట్విస్ట్.

Video Advertisement

డిసెంబర్ 17,2019న బ్రెజిల్ లోని పలాసియో డో ప్లానాల్టోలో జరిగిన థాంక్స్ గివింగ్ కార్యక్రమంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో జైర్ ను ఓ దుండగుడు కత్తితో పొడిచి పారిపోయాడు ,వెంటనే జైర్‌ ని తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేర్చారు , ఆ సమయంలో జైర్ కు ఏడేళ్ల కూతురు తప్ప ఎవరు గుర్తురాలేదు అంట,నా ప్రాణం పోయినా పర్వాలేదు.. నా కూతురుని అనాథను చేయకండి అని మీడియా మీద భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి ఫొటోను కాస్త  ఇప్పుడు కరోనా వ్యాప్తి ని చూసి ఇటలీ అధ్యక్షుడు ఏడుస్తున్నారంటూ ఫేక్ వార్తలు రాసి సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.ఇటలీ అధ్యక్షుడు ఎవరో కింద ఫొటోలో చూడండి.


You may also like