నాని “శ్యామ్ సింగ రాయ్” షూటింగ్ పూర్తి.!

నాని “శ్యామ్ సింగ రాయ్” షూటింగ్ పూర్తి.!

by Mohana Priya

Ads

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ ఇవ్వాళ పూర్తయింది. సోషల్ మీడియా వేదికగా సినిమా బృందం ఈ వార్తని ప్రకటించింది. ఈ సినిమాలో సాయి పల్లవి, క్రితి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Video Advertisement

టాక్సీ వాలా సినిమా తో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ సినిమా బృందం ఒక స్టిల్ ని విడుదల చేసింది అందులో నాని అద్దంలో చూస్తూ పోజ్ ఇచ్చారు.

 

అలాగే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నాని మాట్లాడుతూ “షూటింగ్ అయిపోయింది. మంచి టీమ్ ఉంటే మంచి ఫలితం వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పని మొదలయ్యింది” అని రాసి ఇంకొక ఫోటో షేర్ చేశారు. అందులో నాని ఒక చైర్ లో కూర్చుని ఉన్నారు.  ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో రూపొందింది. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.


End of Article

You may also like