మిల్కీ బ్యూటీగా తమన్నా గురించి పరిచయం చెయ్యక్కర్లేదు. ఈమె అందరికీ సుపరిచితమే.
తన అందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. హీరోయిన్ గానే ఆకట్టుకోవడమే కాక స్పెషల్ సాంగ్స్ తో అభిమానులను ఆకట్టుకుంది ఈ భామ.

Video Advertisement

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల నుండి కూడా తమన్నా పెళ్లి చేసుకోబోతోంది అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా రూమర్లు ఆమె పెళ్లి మీద వచ్చాయి.

సోషల్ మీడియాలో ఇవి వైరల్ గా కూడా మారుతున్నాయి. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ నటుడు తో ప్రేమలో మునిగిపోయిందని తెలుస్తోంది. తమన్నా భాటియా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకోవడానికి గోవా వెళ్ళింది. ఈమె నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సెలబ్రేషన్స్ తో తమన్నా విజయ్ కిస్ కూడా చేసుకున్నారు తెలుస్తోంది. ఇది కూడా ఇప్పుడు నెట్టింట తెగ షికార్లు కొడుతోంది.

ప్రస్తుతం వీళ్ళ ప్రేమ నెట్టింట తెగ వైరల్ అయ్యిపోయింది. అయితే దీనిపైన తమన్నా కానీ విజయ్ కానీ ఇంకా స్పందించలేదు వీళ్ళిద్దరూ నిన్న అర్ధరాత్రి ముంబై రీచ్ అయ్యారు. ఎయిర్ పోర్ట్ లో ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తమన్నా భాటియా విజయ్ మొదటి సారి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లస్ట్ స్టోరీ 2 షూటింగ్ లో కలుసుకున్నారు అప్పటినుండి ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. డిసెంబర్ 21న తమన్న బర్త్డే అయింది. అప్పుడు కూడా వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. అయితే తమన్నా చాలా మంది టాప్ హీరోలు ఉండగా ఎందుకు వాళ్ళని కోరుకోలేదు అని వార్తలు వినపడుతున్నాయి.

విజయ్ చూస్తే చిన్న నటుడు. ఎందుకు చిన్న నటుడిని తమన్నా ఇష్టపడుతోంది..? అని అంతా అంటున్నారు. అయితే ఇది పూర్తిగా వాళ్ళ ఇష్టం. అందరి హీరోయిన్లు పెద్ద పెద్ద హీరోలని పెళ్లి చేసుకోలేదు. కొందరు కామన్ వ్యక్తులని కూడా పెళ్లి చేసుకున్నారు. ఇది ఆమె వ్యక్తిగత విషయం కాబట్టి ఇంత సాగదీయడం ఎందుకు.