ఇవాంకా ట్రంప్ దిగిన తాజ్ మహాల్ ఫొటోలో ఆ తేడా గమనించారా? ఆమె నడుము దగ్గర ఫోటోషాప్ చేసారా?

ఇవాంకా ట్రంప్ దిగిన తాజ్ మహాల్ ఫొటోలో ఆ తేడా గమనించారా? ఆమె నడుము దగ్గర ఫోటోషాప్ చేసారా?

by Sainath Gopi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న ఆయన.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహాత్ముని సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో ఆయన ఏం రాశారన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయఅధ్యక్షుడి సలహాదారు అయిన ఇవాంకాట్రంప్ రంగురంగుల పూల ప్రింట్లతో కూడిన మిడ్డీ డ్రెస్ ధరించి అహ్మదాబాద్ నగరంలో అడుగుపెట్టారు.తన తండ్రితోపాటు యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఏ వన్ విమానంలో వచ్చిన ఇవాంకా వెంట ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు.

Video Advertisement

ఇప్పుడు వారు తిరిగి వెళ్ళిపోయాక…ఇవాంక ట్రంప్ గురించి ఓ వార్త చర్చనీయాంశం అయ్యింది. భారత పర్యటనలో ట్రంప్, ఆయన సతీమణి మలానియా ట్రంప్, ఇవాంకా ట్రంప్ ఆమె భర్త అందరూ కలిసి ఆగ్రాలోని చారిత్రక కట్టడాలను సందర్శించారు. ఈ క్రమంలో ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ ను సందర్శించారు.ఈ సందర్బంగా తాజ్ మహాల్ దగ్గర దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు ఇవాంక ట్రంప్. ‘తాజ్ మహల్ వైభవం, అందం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది’ అంటూ ఇవాంకా పోస్ట్ చేసారు.

ఇప్పుడు ఆ పోస్ట్ చర్చనీయాంశం అయ్యింది. ఈ #FactCheck ఫొటోలను ఇవాంకా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కొద్దిసేపటికే ఆమె ఫొటోపై కామెంట్ల జల్లు కురిసింది. 38 ఏళ్ల ఫస్ట్ డాటర్.. మీ ఫొటోను ఫొటోషాపులో ఎడిట్ చేశారా అంటూ ప్రశ్నించారు. ఇవాంకా నిలబడిన ఫొటోలో వెనుక వైపు తాజ్ మహాల్ ముందు వాటర్ పూల్ ఉంది. ఇవాంకా ఎడమ చేతి మధ్యలో ఉన్న ప్రాంతంలో కనిపించే నీరు.. ఇరువైపులా ఉన్న నీటి కంటే స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది’. ఇవాంకా ఫొటోలో సన్నగా కనబడేలా చేసేందుకు ఎడమ చేతి మధ్యలో ఖాళీ ఎక్కువగా ఉండేలా ఫొటోషాప్ ఎడిటింగ్ చేసినట్టుగా కనిపిస్తోంది.

ఈ ఫొటోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.. ట్రంప్ కుమార్తె #IvankaTrump ఇవాంకా ఫొటోను ఎడిటింగ్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఆమె తన నడుమును చిన్నదిగా చేసింది’ అని ఒక వ్యక్తి ట్విట్టర్‌లో కామెంట్ పెట్టాడు. ’ఆమె నడుము చేయి మధ్య నీటిని చూడండి. ఇది పక్కనే ఉన్న నీటి కంటే రంగు ఆకృతి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది ’ అని ట్వీట్ చేశాడు.

అయితే అసలు కథ ఏంటి అంటే…ఇది ఎడిటింగ్ చేసింది కాదు. ఐఫోన్ లో పోర్ట్రైట్ మోడ్ లో ఫోటో తీస్తే అలాగే వస్తుంది అంట. ఏదేమైనా, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇవాంకా ఫోటోను అదే సమయంలో AFP ఫోటోగ్రాఫర్ మాండెల్ న్గాన్ పోస్టు చేసిన ఇవాంకా ఫొటోతో పోలిస్తే.. ఆమె నడుము ఖచ్చితంగా ఫోటోషాప్ చేసినట్టే’ అని అవుట్‌లెట్‌కు తెలిపింది.

 

ఇవాంక రాక ఏమోగానీ గ‌త కొద్ది రోజుల నుంచి ఈమె నామ స్మ‌ర‌ణే జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో మ‌న‌కు ఇవాంక గురించి తెలిసింది చాలా త‌క్కువే. అస‌లు ఆమె ఏం చేస్తుంది ? ఆమె వ్య‌క్తిగ‌త వివ‌రాలు ఏంటి ? ఆమెకు ఉన్న కంపెనీలు ఏవి ? వ‌ంటి వివ‌రాలు చాలా మందికి తెలియ‌వు. ఇవాంకా ట్రంప్ పుట్టింది 1981 అక్టోబ‌ర్ 30న‌. ఈమె తండ్రి పేరు డొనాల్డ్ ట్రంప్‌. త‌ల్లి పేరు ఇవానా ట్రంప్‌. ఇవాంకా ట్రంప్ పుట్టిందే ధ‌నికుడి ఇంట్లో అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఇవాంకా పుట్టేట‌ప్ప‌టికే ట్రంప్ బిలియనీర్‌గా ఉన్నాడు. ఎన్నో వేల కోట్ల రూపాయ‌ల‌ ట‌ర్నోవ‌ర్ క‌లిగిన కంపెనీలు ట్రంప్‌కు ఉన్నాయి. వాటిల్లో రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ ఒక‌టి. ఇక ఇవాంకా భ‌ర్త పేరు జారెద్ కుష్న‌ర్. ఈమె అమెరిక‌న్ టెలివిజ‌న్ ప‌ర్స‌నాలిటీగా పేరు పొందింది. అంతేకాదు, ఈమె ర‌చ‌యిత‌, ఫ్యాష‌న్ డిజైన‌ర్ కూడా. మ‌హిళా వ్యాపార‌వేత్త‌గా కూడా ఇవాంకా పేరుగాంచింది.

 

జార్జ్‌టౌన్ యూనివ‌ర్సిటీ, యూనివ‌ర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాల‌లో ఇవాంకా విద్యాభ్యాసం కొనసాగింది. ప్ర‌స్తుతం ఈమె త‌న తండ్రి, అమెరికా అధ్య‌క్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్‌కు స‌ల‌హాదారుగా ప‌నిచేస్తోంది. అందుకోసం త‌న తండ్రి వ్యాపారాల‌ను ఆమె వ‌దిలిపెట్టింది. డొనాల్డ్ ట్రంప్ సంతానంలో అంద‌రిక‌న్నా ఇవాంక‌యే పెద్ద‌. ఈమెకు ఇవాంక ట్రంప్ క‌లెక్ష‌న్ అనే సొంత పేరిట ఓ ఫ్యాష‌న్, లైఫ్ స్టైల్ కంపెనీ ఉంది. 2014లో ఫార్చూన్ మ్యాగ‌జైన్ టాప్ 40 లిస్ట్‌లో ఈమెకు 33వ స్థానం ల‌భించింది. 2015లో వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం ఈమెను యంగ్ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా గుర్తించింది. 2017లో టైమ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియ‌ల్ వ్య‌క్తుల లిస్ట్‌లో ఈమెకు చోటు ద‌క్కింది. కాగా ఇప్పుడు ప్ర‌ధాని మోడీ ఆహ్వానం మేర‌కు ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చింది. ఇక ఈమె మొత్తం ఆస్తి 300 మిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంది..!


You may also like