15 ఏళ్ల భారత బాలికపై ఇవాంక ప్రశంసలు…భారతీయుల ప్రేమకు ఇదే నిదర్శనం!

15 ఏళ్ల భారత బాలికపై ఇవాంక ప్రశంసలు…భారతీయుల ప్రేమకు ఇదే నిదర్శనం!

by Sainath Gopi

ఆటోడ్రైవర్ అయిన తండ్రి కాలికి గాయం కావడంతో  ఏ పనికి వెళ్లలేని పరిస్థితి.. బతకడానికి వచ్చిన ఊరిలో లాక్ డౌన్ కారణంగా పనులు కూడా లేవు..సొంత ఊరికి వెళ్దామంటే తండ్రి నడవలేడు..దీంతో ఒక సైకిల్ కొని తండ్రిని వెనక కూర్చొబెట్టుకుని ఢిల్లి శివార్లలోని గురుగ్రామ్ నుండి బీహార్ లోని స్వగ్రామానికి బయల్దేరింది జ్యోతి..మొత్తం 1200కిమి ఏడు రోజుల్లో చేరుకుని అందరిని ఆశ్చర్యపరిచిన జ్యోతికి CFI (భారత సైక్లింగ్ సమాఖ్య) బంపర్ ఆఫర్ ప్రకటించి తనని ఆశ్చర్యపరిచింది.

Video Advertisement

బీహార్లోని దర్భాంగ్ కి చెందిన మోహన్ పాశ్వాన్ పొట్టకూటి కోసం ఢిల్లిలోని గురుగ్రామ్ కి వచ్చాడు.. అక్కడే కిరాయికి ఆటోరిక్షా తీసుకుని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.లాక్ డౌన్ కారణంగా పనులు లేవు, కిరాయి కట్టలేదనే ఆటోరిక్షా కూడా లాక్కుపోయాడు ఓనర్.. ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఇంటి అద్దె కట్టలేక అక్కడే ఉండి పస్తులుండే కంటే ఊరికి వెళ్లిపోవడం బెటర్ అనుకున్నాడు..చేతిలో ఉన్న 1000రూపాయల్లో 500తో ఒక పాత సైకిల్ కొన్నాడు..తండ్రిని వెనుక కూర్చొబెట్టుకుని జ్యోతి ప్రయాణం ప్రారంభించింది.

మద్యమద్యలో ఆగుతూ, రాత్రిపూట పెట్రోల్ బంక్స్ లో పడుకుంటే..ఎవరైనా దాతలు ఆహారం అందిస్తే దాన్నేతింటూ మొత్తానికి ఊరుచేరుకుంది..ఊరికి చేరుకోగానే తండ్రి కూతుర్లకు క్వారంటైన్ పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చింది..ప్రస్తుతం ఇద్దరూ హోం క్వారంటైన్లో ఉన్నారు..జ్యోతి సాహసం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో. కంటే కూతుర్నే  కనాలి అని మరోసారి నిరూపించింది అంటూ నెటిజన్లందరూ తనల్ని ప్రశంసల్లో ముంచెత్తారు..అయితే భారత సైక్లింగ్ సమాఖ్య తన ప్రతిభను గుర్తించి లాక్ డౌన్ తర్వాత ట్రయల్స్ కోసం ఢిల్లికి రావాలని కోరింది.ట్రయల్స్ లో తన టాలెంట్ నిరూపించుకుంటే జాతీయ సైక్లింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తామనే ఆఫర్ ప్రకటించింది.

జ్యోతి ప్రయాణానికి, వసతికి అయ్యే పూర్తి ఖర్చు ఫెడరేషనే భరిస్తుంది.. అంతేకాదు జ్యోతితో పాటు మరొకరు వస్తే వారి ఖర్చులు కూడా పూర్తిగా తామే భరిస్తామని ప్రకటించింది..  ఢిల్లీలో జరిగే ట్రయిల్ లో జ్యోతి పాస్ అయినట్లయితే… న్యూఢిల్లీలోని IGI స్టేడియం కాంప్లెక్స్  దగ్గరున్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నేషనల్ సైక్లింగ్ అకాడమీలో ట్రైనీగా జ్యోతి సెలక్ట్ అవుతుంది. అకాడమీలో ఉన్న కంప్యూటరైజ్డ్ సైకిల్ పై తనకు పరీక్ష పెట్టి, ఎంపిక చేస్తారు..అక్కడ తనని తాను ప్రూవ్ చేస్కుంటే తర్వాత ట్రైనీలలో తను ఒకరిగా ఉంటుందని, తన ట్రైనింగ్ కి జ్యోతి నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోమని CFI ప్రకటించింది.

జ్యోతికి ఈ ఆఫర్ ని ప్రకటించడం గురించి క్వశ్చన్ చేయగా. “జ్యోతిలో ఏదో తెలియని టాలెంట్ దాగి ఉంది.  1200 కి.మీ సైక్లింగ్ చేయడం మామూలు విషయం కాదు. జ్యోతి తప్పనిసరిగా బలం మరియు శారీరక ఓర్పు కలిగి ఉండడం మూలంగానే అది సాధ్యం అయిందని మేం నమ్ముతున్నాం.అందుకే తనని పరీక్షించాలనుకుంటున్నాం” అని CFI చైర్మన్ ఓనార్క్ సింగ్ అన్నారు..

వారం క్రితం వరకు ఆ అమ్మాయెవరో మనకి తెలీదు..ఇప్పుడు సోషల్ మీడియాలో తనొక స్టార్..లాక్ డౌన్ ఎత్తేశాక తనకొచ్చిన సదవకాశాన్ని వినియోగించుకుంటే తనెక్కడుటుందో కూడా మనం చెప్పలేం.. ఏం చెప్తున్నానో అర్దం కావట్లేదా..తండ్రి పట్ల తన ప్రేమను చాటుకున్న కూతురికి CFI ప్రకటించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్లో మనం జ్యోతిని ఊహించని స్థానంలో చూడవచ్చు..కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ జ్యోతి.

జ్యోతి గురించి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ కూడా ట్వీట్ చేసారు. ఆమెపై ప్రశంసలు కురిపించారు. జ్యోతి అందమైన స‌హ‌నం, ప్రేమ భారతీయ ప్రజలనే కాకుండా సైక్లింగ్ ఫెడరేషన్‌ను కూడా ఆకట్టుకుంది అని అన్నారు ఆ ట్వీట్ లో.


You may also like