అవి తింటే లక్ష రూపాయలు మీవే !
ఎప్పుడు చుసిన తినడం తప్ప పైసా సంపాదన లేదు అని తిడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే తిండి తిని మీరు సంపాదించొచ్చు కూడా !
పరోటాలు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి రుచికరమైన పరోటాను చేయడంలో హర్యానా రోహతక్ లోని హోటల్ తపస్య చాలా ఫేమస్. అయితే వీరు ప్రతి సంవత్సరం ఒక విచిత్రమైన పరోటాల పోటీలు నిర్వహిస్తున్నారు.

Video Advertisement

50 నిమిషాల్లో మూడు పరోటాలను తిన్న వారికీ అక్షరాలా 1 లక్ష రూపాయల బహుమానం తో పాటు, జీవితాంతం ఉచితంగా ఆహారాన్ని అందించారు. రెండు కిలోల ఆలూ కుర్మా మధ్యలో కలిగిన ఈ పరోటాలు రెండున్నర అడుగులు ఎత్తు కలిగి ఉంటాయి. వీటి ధర ₹300 గా ఉంది. 2006 వ సంవత్సరం నుంచి పోటీలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు గెలిచింది మాత్రం ఇద్దరి. ఈ పోటీలో పాల్గొనడానికి, ఆ పరోటాల రుచి చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాలు నుంచి జనం తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు..