ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా నడిచే ఒకే ఒక్క టాపిక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. ఈ సీజన్ ఆగస్ట్ చివరిలో, లేదా సెప్టెంబర్ మొదట్లో మొదలు కాబోతోంది. సాధారణంగా బిగ్ బాస్ అంటే చాలా మందికి ఆసక్తి ఉండడానికి కారణం, ఇందులో మన ఫేవరెట్ సెలబ్రిటీస్ నిజ జీవితంలో ఎలా ఉంటారో అనేది చూపిస్తారు. అంతే కాకుండా అలా అంత మంది ఒకే ఇంట్లో ఉంటే, అది కూడా వాళ్ళలో చాలా మందికి ఒకరికి ఒకరు తెలియకపోతే అసలు ఎలా ఉంటారు అనేది కూడా తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది.

jabardast artist shares video from bigg boss set

ఇందులోకి వెళ్తున్న కంటెస్టెంట్ వీళ్ళే అంటూ చాలా మంది పేర్లు ఇప్పటివరకు వినిపించాయి. కొంత మంది పేర్లు కన్ఫామ్ కూడా అయ్యాయి. అయితే ఒక కంటెస్టెంట్ మాత్రం ఏకంగా సెట్ లో నుండి వీడియో పోస్ట్ చేశారు. జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక బిగ్ బాస్ సెట్ లో ఉన్న వీడియో ని పోస్ట్ చేశారు. ఇంస్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేసిన ప్రియాంక ఉన్న వీడియోలో వెనకాల బిగ్ బాస్ 5 అని రాసి ఉన్న సెట్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :