Home Filmy Adda “అసలు రష్మీకి పెళ్లయ్యిందని ప్రేక్షకులకి తెలుసా.?” అంటూ అసలు విషయాన్ని బయటపెట్టిన జబర్దస్త్ సతీష్.! (వీడియో)

“అసలు రష్మీకి పెళ్లయ్యిందని ప్రేక్షకులకి తెలుసా.?” అంటూ అసలు విషయాన్ని బయటపెట్టిన జబర్దస్త్ సతీష్.! (వీడియో)

by Mohana Priya

సుడిగాలి సుధీర్, రష్మీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలు క్రేజ్ లేదు. గత 9 సంవత్సరాలుగా వారి లవ్ ట్రాక్ నడుస్తూనే ఉంది. ఈ టీవీలో జరిగే ప్రతి స్పెషల్ ఈవెంట్ లో సుధీర్, రష్మీ స్పెషల్ పర్ఫామెన్స్ ఉండడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల జరిగిన వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ లో కూడా రష్మీ సుధీర్ కోసం ఒక స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చారు. వీళ్ళ ఇద్దరికీ సంబంధించి ఏదైనా వీడియో యూట్యూబ్ లో పెడితే కూడా, “మీరిద్దరు కలవాలి అని మేము కోరుకుంటున్నాము” అని కొన్ని లక్షల్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి.jabardast sathish about rashmi marriage

సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా వీరిద్దరి పేరు మీద ఎన్నో ఫ్యాన్ పేజస్ ఉన్నాయి. కానీ మనలో చాలా మందికి ఇదంతా టీఆర్పీ ఎక్కువగా రావడానికి చేస్తారు అనే విషయం తెలుసు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై అంతకు ముందు జబర్దస్త్ లో ఎన్నో స్కిట్స్ లో కనిపించిన సతీష్, సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. “వారిద్దరి గురించి నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒకతను వచ్చి,”అన్నా, వారిద్దరూ కలవాలి” అన్నాడు. నాకు “ఏంటి తను పిచ్చి వాడిలా ఉన్నాడు?” అనిపించింది. అసలు రష్మీకి పెళ్లి అయింది అన్న విషయం తెలుసా?” అని సతీష్ అన్నారు.jabardast sathish about rashmi marriage

అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి, “రష్మీకి పెళ్లి అయిందా?” అని అడిగితే, “పెళ్లి అయిందో లేదో అనే విషయం తెలుసా?” అని మళ్లీ చెప్పారు సతీష్. “సుధీర్ కి పెళ్లి అయిందా లేదా అనే విషయం తెలుసా” టీఆర్పీ కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారు. అలాగే అనసూయ గారికి కూడా అలా లవ్ ట్రాక్ పెడుతున్నారు. ఆవిడకి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆవిడ బంగారం. జనాలు పిచ్చి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చూపిస్తున్నారు. మీరు చూసినంత కాలం వాళ్లు అలాంటివి చూపిస్తూనే ఉంటారు. సుధీర్, రష్మీ చచ్చిపోయేంత వరకు కలవరు. నేను గ్యారంటీ ఇస్తున్నా” అని అన్నారు సతీష్.

watch video : 

https://youtu.be/mZ0p3CdUrQM

You may also like