ఇన్నాళ్లు దొరబాబునే అనుకున్నాము..ఇప్పుడు పరదేశి కూడా..! అడ్డంగా దొరికినా ఇంకా ఆదరిస్తారా అభిమానులు.?

ఇన్నాళ్లు దొరబాబునే అనుకున్నాము..ఇప్పుడు పరదేశి కూడా..! అడ్డంగా దొరికినా ఇంకా ఆదరిస్తారా అభిమానులు.?

by Sainath Gopi

Ads

జబర్దస్త్ ఈ పదానికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలిగింట ప్రతి నోట నానే మాట, ప్రతి టి.వి.లో వచ్చే ఆట. గురువారం, శుక్రవారం వచ్చిందంటే ఆ రోజు రాత్రి జబర్దస్గ్ షో టైం ఎప్పుడవుతుందా. ఈ రోజు ఎలాంటి స్కిట్ లు వస్తాయా అని ఎదురుచూసే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. అలాంటి జబర్దస్త్ లో ఎక్కువ ఫాలోవింగ్ ఉన్న టీం హైపర్ ఆది రైసింగ్ రాజుల టీం. యూట్యూబ్ లో ఉండే మిలియన్ వ్యూస్ ఏ దానికి సాక్ష్యం.

Video Advertisement

కెరీర్ స్టార్టింగులో బి గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ లో  నటించడంతో అమ్మాయిల పిచ్చి ఉన్న వాడిగా దొరబాబుపై  హైపర్ ఆది తో పాటు సహా పార్టిసిపెంట్స్ సెటైర్లు వేస్తూనే ఉంటారు ,ఆ విషయం అందరికి తెలిసిందే ఇక ఆది టీం లో చేరాకా తన డైలాగ్స్ తో,ఆది వేసే పంచులతో స్కిట్ మొత్తం అందరిని నవ్వించి జబర్దస్త్ లో నే ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు కొన్ని నెలల క్రితం  దొరబాబు నెల్లూరు కి చెందిన ఓ న్యూస్ యాంకర్ ని  అన్నవరంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని కొన్ని నెలలు కూడా కాలేదు ఇంతలో అతను చేసిన పనికి సోషల్ మీడియా లో తిడుతున్నారు ,మరి ఎప్పుడు ఆ విషయం గురించి దొరబాబుపై సెటైర్ వేసే హైపర్ ఆది ఇప్పుడు కూడా అలాగే స్పందిస్తాడా? ఇంతకీ దొరబాబు పరదేశి ఏం చేసారో వివరాలు చూడండి.

ఓ అపార్ట్‌మెంట్‌లో  వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్‌ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. జబర్దస్త్ అభిమానులకి ఈ వార్త కొంచెం షాకింగ్ గానే ఉంటుంది. విశాఖపట్నంలోని మాధవధారలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో వారిని విచారిస్తున్నారు.

పక్కింటోడు, పక్కింటి భార్య, లైన్లు వేయడం, అక్రమ సంబంధాలు, లేచిపోవడాలు మీదే స్కిట్ వేసుకుని కామెడీ పాందిచినప్పుడే ఆ ఛానల్ స్థాయి దిగజారిపోయింది. ఇక ఇలాంటివి బయటకి వచ్చినప్పుడు ఆ షో రేంజ్ తగ్గుతుంది అంటారా? లేకపొతే ఇవన్నీ సహజమే…మనం కామెడీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ గురువారం రాత్రి తొమ్మిదిన్నర ఎప్పుడు అవుతుందా అనుకుంటూ ఎదురు చూడటం బెటర్ అనుకుంటారా ఆడియన్స్.


End of Article

You may also like