Ads
బుల్లితెరపై ఎంతో జనాధారణ కలిగిన కామెడీ షో జబర్దస్త్ షూటింగ్ తిరిగి మళ్ళీ మొదలైంది.కాగా రాబోయే జబర్దస్త్ ఎపిసోడ్స్ ప్రోమోస్ ను ఇటీవల ఈటీవీ విడుదల చేసింది.అయితే అందులో కొంతమంది కమెడియన్లు చేతికి గ్రీన్ బ్యాండ్ కట్టుకొని ఉన్నారు.దీంతో అసలు జబర్దస్త్ కమెడియన్స్ ఎందుకు ఆలా గ్రీన్ బ్యాండ్స్ ధరించారు అని ప్రేక్షకులలో పెద్దగా చర్చలు మొదలయ్యాయి .ఆ వివరాలేంటో చూద్దాం ..
Video Advertisement
తాజాగా విడుదల అయిన జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలలో కొంతమంది గ్రీన్ బ్యాండ్స్ కట్టుకున్నారు.కానీ కొంతమంది మాత్రం గ్రీన్ బ్యాండ్స్ కట్టుకోలేదు.అసలు గ్రీన్ బ్యాండ్స్ ధరించడం వెనకాల గల కారణాలు ఏమి అయ్యుండచ్చు అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.ఈ గ్రీన్ బ్యాండ్స్ జబర్దస్త్ లో ఎందుకు ధరించారు అని తెలుసుకోవడానికి పలు ప్రయత్నాలు చేసిన నెటిజన్స్ చివరకి ఏమి తెలుసుకోలేకపోయారు.దీంతో జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ విడుదల అయ్యాక ఈ గ్రీన్ బ్యాండ్స్ ఎందుకు ధరించారో తెలుస్తుంది అని అనుకున్నారు.
కానీ జబర్దస్త్ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఈ గ్రీన్ బ్యాండ్స్ ఎందుకు ధరించారు అనే ప్రస్తావన రాలేదు.దీంతో నెటిజన్లలో గ్రీన్ బ్యాండ్స్ గురించి మొదలైన ప్రశ్న ప్రశ్నలనే మిగిలిపోయింది.కాగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు అన్ని కూడా మధ్యలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే.దాదాపు మూడు నెలల నుండి కొత్త షూటింగ్లు ఏమి జరగలేదు.దీంతో చాలా టీవీ షోస్ యొక్క టి ఆర్ పి రేటింగ్స్ బాగా పడిపోయాయి.అయితే తాజాగా కొన్ని నిబంధనలతో మళ్ళీ టీవీ షూటింగ్స్ అన్ని మొదలయ్యాయి.
End of Article