లాక్ డౌన్ వేళ జబర్దస్త్ మహేష్ పెళ్లి… ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

లాక్ డౌన్ వేళ జబర్దస్త్ మహేష్ పెళ్లి… ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

by Megha Varna

Ads

లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు.పెళ్లి కానీ ప్రసాదులు ఎప్పడు లాక్ డౌన్ ఎత్తివేస్తారా అని ఎదురుచూస్తున్నారు.కాగా తాజాగా టాలీవుడ్ లో కొంతమంది సెలెబ్రెటీలు ఈ లాక్ డౌన్ లో ఏడూ అడుగులు వేశారు.మొన్ననే దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు.దిల్ రాజు కూతురు పెళ్లి పెద్దగా మారి వివాహం చేయించడం విశేషం.హీరో నిఖిల్ కూడా నిన్ననే వివాహం చేసుకున్నారు.ఈరోజు ఉదయమే జబర్దస్త్ మహేష్ వివాహం చేసుకున్నారు ..ఆ వివరాలేంటో చూద్దాం..

Video Advertisement

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహేష్ అందరికి కూడా జబర్దస్త్ షో ద్వారా సుపరిచితులు.జబర్దస్త్ లో కిరాక్ ఆర్మీ లో స్కిడ్స్ చేస్తూ ఉంటారు మహేష్.తరవాత వెండితెరకు కూడా పరిచయం అయ్యారు.రంగస్థలం లో చిట్టిబాబు ఫ్రెండ్ గా ,శతమానం భవతి సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషించారు.లాక్ డౌన్ కారణంగా తన పెళ్లి ని అతి తక్కువ మందితో చేసుకున్నాడు జబర్దస్త్ మహేష్.తన బంధువుల అమ్మాయి  పావనిని వివాహం చేసుకున్నాడు మహేష్.7 అడుగులు నడిచి సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న మహేష్ ను సోషల్ మీడియా వేదిక గా సెలబ్రెటీలు మరియు సామాన్య ప్రేక్షకులు అందరు అభినందిస్తున్నారు.మహేష్ పావని ల జోడి అదిరింది అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇక పొతే లాక్ డౌన్ కారణంగా చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న సంగతి అటు ఉంచితే చాలా తక్కువ మందితో సామాజిక దూరం పాటిస్తూ వివాహం చేసుకోవచ్చు అనే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.కానీ పెళ్లి అంటే జీవితంలో ఒక్కసారే జరిగే వేడుకగా గనుక అందరూ బందు మిత్రులతో కలిసి చేసుకోవాలని కోరిక ఎవరికైనా ఉంటుంది .కాబట్టి లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత పెళ్లి చేసుకుందాం అని చాలా మంది ఎదురు చూడటం గమనించాల్సిన విషయం.కానీ ఈ లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారనేది ఎవరికీ అర్ధం కావట్లేదు.గడువు ముగిసింది అనేలోపు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు.


End of Article

You may also like