దొరబాబు, పరదేశిపై జబర్దస్త్ నవీన్ కామెంట్స్..! ఆ రోజు అసలేం జరిగిందో?

దొరబాబు, పరదేశిపై జబర్దస్త్ నవీన్ కామెంట్స్..! ఆ రోజు అసలేం జరిగిందో?

by Sainath Gopi

Ads

జబర్దస్త్ ఫేమ్ దొరబాబు, పరదేశి వ్యభిచారం కేసులో పట్టుబడ్డ విషయం అందరికి తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ నవీన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో దొరబాబు, పరదేశి ల వివాదంపై తెలివిగా స్పందించారు. అసలు ఈ విషయం గురించి ఎక్కువగా మనకు తెలీదని, అలా ఇలా అని బయట వినడమేనని అన్నాడు. అసలు ఏం జరిగిందో తెలియకుండా మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. వారు బయటకు వచ్చి చెబితేనే అసలు నిజం తెలుస్తుందని వివరించాడు. ఇప్పుడైతే ఏం మాట్లాడాను అని తెలివిగా తప్పించుకున్నాడు. అదిరే అభి టీం లో జూనియర్ రాఘవేందర్ రావు గా బాగా ఫేమస్ అయ్యారు గడ్డం నవీన్.

Video Advertisement

దొరబాబు ఇలా చేయడంపై అతని భార్య స్పందించారు. ఓ వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు గతంలో ఆ వ్యక్తి మనతో ఎలా ప్రవర్తించాడు అనే విషయాన్ని మరిచిపోకూడదు. ఒక్కోసారి మన కళ్లు కూడా మనల్ని మోసం చేస్తాయి. మన కళ్లను నమ్మలేని పరిస్థితి వస్తుంది అంటూ తన భర్తను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అమూల్య.

అంతేకాదు తన భర్త గురించి తన కంటే బాగా ఇంకెవరికి తెలీదు. ఇలాంటి ఆరోపణలు ఎన్ని వచ్చిన అతనిపై నా నమ్మకం తగ్గదు అని స్పష్టం చేసింది అమూల్య. ఒకోసారి తమ ప్రమేయం లేకుండానే ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటారు కొందరు. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది అని తన భర్తకి సపోర్ట్ చేసారు అమూల్య.

నెల్లూరుకు చెందిన ఓ లోకల్ ఛానల్‌ లో యాంకర్ గా చేసే అమూల్య రెడ్డి(నందిని రెడ్డి) ని 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. ఆమె టిక్ టాక్ వీడియో లతో కూడా తెలుగు ఆడియన్స్ లో బాగానే ఫేమస్ అయ్యింది. తన భర్త వ్యభిచార గృహంలో దొరికిన రోజునే ఆమె టిక్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. డి ఫర్ దొరబాబు, మై లైఫ్ లవ్ యు సోమచ్ బుజ్జీ అంటూ టాటూ వేయించుకుంది దొరబాబు భార్య నందిని రెడ్డి. భర్త అలా అరెస్ట్ అయిన రోజే ఆమె ఇలా టాటూ వేయించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కెరీర్ స్టార్టింగులో బి గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించడంతో అమ్మాయిల పిచ్చి ఉన్న వాడిగా దొరబాబుపై హైపర్ ఆది తో పాటు సహా పార్టిసిపెంట్స్ సెటైర్లు వేస్తూనే ఉంటారు ,ఆ విషయం అందరికి తెలిసిందే…కానీ ఆ తర్వాత అతను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు అనుకున్నాము. ఇప్పుడు ఇలా అరెస్ట్ అయ్యే సరికి పెళ్లయ్యాక కూడా ఇంకా అవేం పనులు అని తిడుతున్నారు అందరు.

image source:1


End of Article

You may also like