జబర్ధస్త్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు . ఆ షో కోసం ఎంతో మంది గురువారం, శుక్రవారం రాత్రి 9గంటల 30నిమిషాల కోసం పడిగాపులు కాస్తుంటారు. ఈ షో నుంచి ఎంతో మంది కమిడియన్స్‌ సినిమాల్లో అవకాశాలు సాధించారు.

Video Advertisement

అందులో ఒకరు చమ్మక్ చంద్ర. అ ఆ’, ‘అరవింద సమేత’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘రాజా ది గ్రేట్’, ‘టాక్సీవాలా’, ‘వెంకీ మామ’ సినిమాల్లో నటించారు చంద్ర.తాజాగా జబర్దస్త్ లో జరిగిన వివాదాల గురించి అందరికి తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు ఈ షో నుండి బయటకి వచ్చేసారు.

మరో ఛానల్ లో ప్రసారమయ్యే అదిరింది షోలో జడ్జిగా చేస్తున్నారు నాగబాబు. నాగబాబు తో పాటు చమ్మక్ చంద్ర కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి అదిరింది షోలో చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చమ్మక్ చంద్ర జబర్దస్త్ రెమ్యూనరేషన్ల గురించి లీక్ చేసారు.

జబర్దస్త్ లో అందరి కంటే తనకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు. ఒక్కో టీమ్‌కు ఒక్కోలా రెమ్యూనరేషన్ ఉంటుందని సంవత్సరానికి ఒకసారి పెంచుతారనే విషయాలు వెల్లడించారు చంద్ర. టీమ్‌లలో చేసే వారికి ప్రాధాన్యతను బట్టి రెమ్యూనరేషన్ డిసైడ్ చేస్తామని చెప్పారు చంద్ర.