జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?

జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?

by Harika

Ads

జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో పేపర్ బాయ్, అరి దర్శకుడు

Video Advertisement

సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా పేపర్ బాయ్ సినిమాలో చూపించి మెప్పించాడు దర్శకుడు జయ శంకర్. ఇక రెండో ప్రయత్నంగా అరి అంటూ అరిషడ్వర్గాల మీద చిత్రాన్ని తీశాడు. ఇప్పటికే ఈ మూవీ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. పలువురు సెలెబ్రిటీలు సినిమాను చూసి మెచ్చుకున్నారు కూడా. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

అయితే ఈ క్రమంలో దర్శకుడు జయ శంకర్ కొత్త సినిమా మీద రూమర్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఈయన ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా, ఆ కథకు నయనతార ఓకే చెప్పినట్టుగా ఆ మధ్య రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద కొత్త రూమర్ వినిపిస్తోంది. జయశంకర్ అనుకుంటున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌కు సౌత్, నార్త్‌లో మంచి క్రేజ్ ఉన్న నటిని తీసుకున్నారని సమాచారం.

 

శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో జయ శంకర్ తన లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను చేస్తున్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియాగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక జయశంకర్ తీసిన అరి చిత్రం ఈ ఎన్నికల హడావిడి అయిపోయిన తరువాత థియేటర్లోకి రానుంది. జూన్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


End of Article

You may also like