Ads
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబ వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ సింగ్ జడేజా కోడలు రివాబాపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన అనంతరం జడేజా తండ్రి ఇంటికి సందర్శకుల తాకిడి బాగా పెరిగిపోయిందట. ఇంటర్వ్యూల కోసం పత్రికల వారు ఎవరో ఒకరు వారి ఇంటికి రావటం, మీ కొడుకుతో మీ బంధం గురించి చెప్తే రాసుకుంటాం అని ఆయన వెంట పడటం జరుగుతున్నదట. వీరి నుంచి తప్పించుకునేందుకు ఆయన ఉదయాన్నే ఇంటిని వదిలిపెట్టి ఎప్పుడో చీకటి పడ్డాక ఇంటికి చేరుకుంటున్నారంట.
Video Advertisement
అయితే ఇంటర్వ్యూల కోసం జడేజా తండ్రి ఇంటికి వెళ్లిన వాళ్లు ఆ ఇంటిని చూసి వాపోతున్నారు ఆ ఇంటిపై కథనాలు రాస్తున్నారు. జడేజా దంపతులు ఉన్న ఇంటితో ఈ ఇంటిని పోలుస్తూ వ్యాసాలు రాస్తున్నారు. అయితే ఇంతకీ రవీంద్ర జడేజా తండ్రి కొడుకు కోడలు మీద చేసిన ఆరోపణలు ఏమిటో చూద్దాం. తన కొడుకు ఒక ఇంటివాడు అవుతుంటే తానంతో మురిసిపోయానని కానీ కోడలు ఏం మాయ చేసిందో తెలియదు మూడు నెలలకే మారిపోయాడని తన ఆవేదన వ్యక్తం చేశాడు. కొడుకు పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ కోడలు తన పేరు మీదకు మార్చుకుందని తెలిపారు.
ఒకే నగరంలో ఉంటున్నప్పటికీ ఎవరి జీవితం వారిదేనని, మనవరాలను చూసి ఐదేళ్ల అయిందని ఎంతో బాధపడ్డారు. నిజానికి రవీంద్ర జడేజా తల్లిని కోల్పోయినప్పటికీ ఆ తండ్రి ఎంతో జాగ్రత్తగా పెంచుకొచ్చాడు. 1988 డిసెంబర్ 6న జడేజా రాంనగర్ జిల్లాలో పుట్టాడు. బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న అతను తండ్రి, తోబుట్టువుల నీడలో పెరిగి పెద్దయి గొప్ప క్రికెటర్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా కోట్ల రూపాయలు అర్జించాడు తర్వాత ఒక ధనిక కుటుంబానికి చెందిన రివాబాను మనువాడాడు.
అక్కడితో తండ్రి తోపుట్టులతో జడేజాకు సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు జడేజా తన భార్య అత్తమామలతో కలిసి ఒక ఖరీదైన బంగ్లాలో నివసిస్తుండగా అతని తండ్రి మాత్రం పాత ఇంటిలోనే జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో అక్క చెల్లెలు కంటికి రెప్పలా చూసుకున్న తండ్రిని అలా నిర్లక్ష్యం చేయటాన్ని తప్పు పడుతున్నారు నెటిజన్స్ ఎప్పటికైనా తండ్రిని తనతో రమ్మని కోరాల్సిందిగా అతనికి సూచిస్తున్నారు. మరి దీనిపై జడేజా ఎలా స్పందిస్తాడో చూడాలి.
End of Article