హైదరాబాద్ వాసులు జాగ్రత్త..! హైదరాబాద్‌కు వచ్చేసిన కరోనా? ఆ ఎయిర్ హోస్టెస్?

హైదరాబాద్ వాసులు జాగ్రత్త..! హైదరాబాద్‌కు వచ్చేసిన కరోనా? ఆ ఎయిర్ హోస్టెస్?

by Megha Varna

Ads

వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని వణికిస్తుంది. చైనా నుండి పాకి అనేక దేశాలకు చేరుకుంది. మన భారత్ లో కూడా కేరళ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొత్తగా నాలుగు నగరాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి అనుమతించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్‌తోపాటు అలిప్పీ(కేరళ), ముంబయి, బెంగళూర్లను చేర్చింది.కరోనా వైరస్ హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. ఇటీవల చైనా నుంచి 32 మంది హైదరాబాద్ వచ్చారు. వారిని గుర్తించిన కేంద్రం.. వారందరికి నోటీసులు పంపింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని నోటీసుల్లో తెలిపింది. డాక్టర్ లు మాత్రం వారిని సెపరేట్ గా పెట్టాలని నిశ్చయించారు. చైనా నుండి వచ్చిన అనుమానితుల్లో ఓ ఎయిర్ హోస్టెస్ కూడా ఉంది. మొత్తం 90 మంది వస్తే. అందులో 36 మందికి కరోనా వైరస్ లేదు అని నిర్దారించారు. మిగిలిన వారికీ పరీక్షలు జరుగుతున్నాయి. ఐసొలేషన్ వార్డ్ లో పెట్టారు. కరోనా వైరస్‌ రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగు చెర్యలు తీసుకుంటుంది అని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

Video Advertisement

అలాగే మనం కూడా జాగ్రత్తలు పాటిద్దాం. ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు. ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి. చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి .జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా చాలా రోజులనుండి ఉంటె వెంటనే డాక్టర్ ని కలవండి.


End of Article

You may also like