“అది నాకు గిఫ్ట్ గా వచ్చింది…ఇప్పుడు తలచుకుంటే బాధగా ఉంది” అంటూ శ్రీదేవి కూతురు కామెంట్స్.!

“అది నాకు గిఫ్ట్ గా వచ్చింది…ఇప్పుడు తలచుకుంటే బాధగా ఉంది” అంటూ శ్రీదేవి కూతురు కామెంట్స్.!

by Megha Varna

Ads

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాహ్నవి కపూర్ తన తొలి చిత్రం దడక్‌తో మంచి నటన కనబరచి అందరి చేత మంచి మార్కులే వేయించుకుంది.ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఘోస్ట్ సీరీస్ లో కీలకపాత్ర చేసింది.ప్రస్తుతం ఈమె భారత తొలి వైమానిక దళ పైలెట్‌ గుంజన్‌ సక్సెనా బయోపిక్ లో నటిస్తుంది.ఈ చిత్రం కోసం జాహ్నవి కపూర్ గత కొంతకాలంగా గుంజన్‌ సక్సెనాతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.

Video Advertisement

నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుంది.ఈ చిత్ర ప్రమోషన్స్ లో జాహ్నవి కపూర్ మాట్లాడుతూ గుంజన్‌ సక్సెనా తో ఎక్కువ సమయం గడపడం వల్ల నేను ఆమె నుండి బోలెడు విషయాలు నేర్చుకున్నాను.ఆమె తన స్వయం శక్తి వల్లే లైఫ్ లో బోలెడు సాధించారు.కానీ నేను ఇంకా మొదలుపెట్టకుండానే నాకు స్టార్ ఇమేజ్ గిఫ్ట్ గా వచ్చింది.అదిప్పుడు తలచుకుంటే నాకు చాలా గిల్టీగా ఉంది అని తెలిపారు.

ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న గుంజన్‌ సక్సెనా గారు తను ఆ టైంలో ఎదుర్కొన్న పరిస్థితులలో కొన్నిటిని అక్కడికి వచ్చిన వారితో పంచుకున్నారు.తను మొదటి లేడీ పైలట్ కావడంతో అక్కడ సపరేట్ డ్రెస్సింగ్ రూమ్,వాష్ రూమ్స్ లేవని అలాగే తనని ఓ మహిళా అధికారిగా చూడకుండా ఒక అధికారిగా చూడడం కోసం తానెంతో కష్టపడ్డానని అన్నారు.


End of Article

You may also like