Ads
మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. స్టార్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచన అందించగా విజయభాస్కర్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ అబౌట్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ కి పెద్ద ఫాన్స్ ఉంటారు.
Video Advertisement
పల్లెటూరు నుండి వచ్చిన అమాయకుడులా చిరంజీవి నటన అందరికీ గుర్తుండిపోయింది. చిరంజీవికి తోడు సునీల్, బ్రహ్మానందం, వేణుమాధవ్ చేసే కామెడీ అయితే అసలు పొట్ట పగిలిపోతుంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు సమీరారెడ్డి, భూమిక నటించారు.
మణిశర్మ అందించిన పాటలైతే ఆల్బమ్ మొత్తం హిట్టే. జై జై గణేష పాట అయితే ఇప్పటికి వినాయక మండపాల దగ్గర మారుమోగుతూ ఉంటుంది. టీవీలో జై చిరంజీవి సినిమా ఎప్పుడు వచ్చిన కుటుంబం మొత్తం టీవీకి అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు.అయితే మీరు ఎన్నిసార్లు జై చిరంజీవ సినిమా చూసిన కూడా మీరు ఎప్పటికీ గమనించని ఒక విషయాన్ని మేము కనిపెట్టాం… అది చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. అది ఏ సీన్లో అంటే…
సినిమాలో చిరంజీవి అమెరికా వెళ్లడం కోసం భూమికానీ పెళ్లి చేసుకోవడానికి ఒక చర్చికి వెళ్తారు. ఒకపక్క చిరంజీవిని ప్రేమించిన సమీరా రెడ్డి పెళ్లిని చూడలేక ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క చిరంజీవి సమీరా రెడ్డిని ఓదారుస్తూ ఉంటాడు. ఈ ఇదంతా జరుగుతూ ఉంటే ప్రేక్షకులు దృష్టంతా చిరంజీవి సమీరారెడ్డి భూమిక పైనే ఉంది. సరిగ్గా అదే టైంలో చిరంజీవి వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో వేణుమాధవ్ చర్చి ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు. అది ఎవరు గమనించరు.
సరిగ్గా ఆ సీను చూస్తే చర్చి ఫాదర్ వేణుమాధవ్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత వేణుమాధవ్ కామెడీగా తిరిగి చర్చి ఫాదర్ కి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఈ సీన్ చూసిన ఎవరికైనా సరే నవ్వు ఆగదు అంటే ఒట్టు. మీరు కూడా ఓ లుక్ వేసేయండి ఆ సీన్ పైన…
watch video:
End of Article