Home Filmy Adda “జైలర్” కి మరొక వివాదం..? ఆ సినిమా కాపీనా..?

“జైలర్” కి మరొక వివాదం..? ఆ సినిమా కాపీనా..?

by Mohana Priya

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా జైలర్. ఈ సినిమాలో రజనీకాంత్ పక్కన రమ్య కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి తెరపైన కనిపిస్తున్నారు. అంతే కాకుండా తమన్నా కూడా మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది.

ట్రైలర్ లో చాలామంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. అయితే ఈసారి కేవలం తమిళ్ వాళ్ళనే కాకుండా తెలుగు మలయాళం వాళ్ళని కూడా సినిమాలో ఎంచుకున్నారు. అలా మన తెలుగు నుండి సునీల్, నాగబాబు కూడా ఈ సినిమాలో ఉన్నారు. మలయాళం నుండి మోహన్ లాల్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

jailer movie copied from a hollywood movie

అలాగే హిందీ నటుడు జాకీ ష్రాఫ్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థం అవుతోంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఇంతమంది పెద్దపెద్ద నటీనటులు ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా నుండి విడుదల అయిన కావాలా పాట ఇప్పటికే చాలా ఫేమస్ అయ్యింది. ట్రైలర్ చూస్తూ ఉంటే ఇందులో రజనీకాంత్ ఒక సాధారణ వ్యక్తి అని కానీ తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోరు అని అర్థం అవుతోంది.

jailer movie copied from a hollywood movie

కానీ ఈ ట్రైలర్ చూశాక ఇది ఒక ఇంగ్లీష్ సినిమాని పోలి ఉంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ట్రైలర్ లో చూపించిన కథ ప్రకారం ఈ సినిమా 2021 లో వచ్చిన నో బడీ అనే ఒక ఇంగ్లీష్ సినిమాని పోలి ఉంది అని అంటున్నారు. అందులో కూడా హీరో తన కుటుంబంతో ఉంటాడు. అనుకోకుండా ఒక గ్యాంగ్ తో తలపడాల్సి వస్తుంది. ఇప్పుడు రజినీకాంత్ జైలర్ సినిమా స్టోరీ చూస్తుంటే కూడా దాదాపు అలాగే ఉన్నట్టు అనిపిస్తోంది. అయితే మరి కొంత మంది మాత్రం, “జైల్లో ఒక అతను ఇరుక్కుంటాడు అని, అతనిని తీసుకురావడానికి కొంత మంది సభ్యులు ఎలా ప్రయత్నించారు అనేది జైలర్ సినిమా” అని అంటున్నారు.

jailer movie copied from a hollywood movie

కానీ ట్రైలర్ మాత్రం నో బడీ సినిమాని పోలి ఉండడంతో ఇది కాపీ అయితే కాదు కదా అని సందేహం వస్తోంది. ఇప్పటికే సినిమా గురించి చాలా వివాదాలు వచ్చాయి. ఇప్పుడు ఇది కూడా యాడ్ అయ్యింది అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలో కూడా నటిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

ALSO READ : “సాయి ధరమ్ తేజ్” తో ఉన్న హీరోను గుర్తు పట్టారా..? ఇలా మారిపోయాడేంటి?

You may also like