Ads
జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్ చౌదరికి రీసెంట్ గా కోయిలమ్మ ఫేమ్ తేజస్విని గౌడతో ఘనంగా నిశ్చితార్థం జరగడం అందరికీ తెలిసిందే. కొత్తగా ఒకటి కాబోతున్న ఈ జంట మీద అటు యూట్యూబ్ లో ఇటు ట్విట్టర్లో చాలామంది నెగటివ్ కామెంట్స్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు.
Video Advertisement
ఈ క్రమంలో పని కట్టుకుని కొంతమంది అదే పనిగా నెగిటివ్ కామెంట్లు పెట్టడంతో అమర్ దీప్ చౌదరి తనకు కాబోయే భార్యతో సహా లైవ్‌లోకి వచ్చి తమ మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్న వారిపై రెచ్చిపోయాడు.
ఒకవైపు నుంచి తేజస్విని కామ్ డౌన్ అని ఎంత కంట్రోల్ చేయాలని ట్రై చేసిన అమర్ ఏ మాత్రం తగ్గకుండా అనవసరంగా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని కడిగిపారేశాడు.మా ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అని నాలుగు సంవత్సరాల నుంచి మా మధ్య లవ్ నడుస్తోందని పిచ్చిపిచ్చిగా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతున్నారు. మా రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకొని నిర్ణయించుకున్నాకే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాం.
నేనంటే పడని వాళ్లు.. తనంటే పడని వాళ్లు.. మేము బాగుంటే అస్సలు చూడలేని వాళ్లు. కుళ్లు, కసి, దురద, వీడ్ని పట్టుకుని పసికేయాలి.. నాశనం చేయాలని చూసేవాళ్లు నాకు బొచ్చెడు మంది ఉన్నారు. ఓ మనిషి సంతోషంగా ఉంటే వీళ్లు అస్సలు చూడలేరు అంటూ విరుచుకుపడ్డాడు. అంతా అయ్యాక తేజస్విని మాత్రం కామెంట్స్ తట్టుకోలేక అమర్ తన బాధను ఈ రూపంలో వ్యక్తీకరించాడని అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని విషయాన్ని కప్పిపుచ్చడానికి ట్రై చేసింది.
End of Article