జనసేనకి ఇచ్చిన 7 లోక్‌సభ స్థానాల్లో ఎక్కడి నుండి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందో చెప్పిన కాపు నాయకుడు!

జనసేనకి ఇచ్చిన 7 లోక్‌సభ స్థానాల్లో ఎక్కడి నుండి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందో చెప్పిన కాపు నాయకుడు!

by Mohana Priya

Ads

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరికి వస్తుండడంతో ప్రతి నాయకుడు ప్రచారం పనిలో ఉన్నారు. మార్చి రెండో వారం నాటికి షెడ్యూల్ ఖరారు అవుతుంది. ఒకపక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 6 విడతల్లో అభ్యర్థులను ఖరారు చేయగా, మరొక పక్క తెలుగుదేశం-జనసేన పార్టీ కూటమి అభ్యర్థుల జాబితా ఇంకా వెలువడలేదు.

Video Advertisement

అందుకు కారణం సీట్ల పంపకం ఇంకా జరుగుతూనే ఉంది. ఇందులో సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ఈ కారణంగానే ఆలస్యం అవుతోంది. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీని కూడా వారితో కలుపుకోవడానికి ఈ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో, కాపు నాయకుడు మాజీ మంత్రి అయిన చేగొండి హరిరామ జోగయ్య చర్చల్లో నిలిచారు. తెలుగు వన్ ఇండియా కథనం ప్రకారం… ఆయన పవన్ కళ్యాణ్ కి ఒక లెటర్ రాశారు. రాబోతున్న ఎన్నికలకు సంబంధించిన సూచనలు, సలహాలు పవన్ కళ్యాణ్ కి ఇచ్చారు. ఇందులో ఏ లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేయాలి అనే విషయాలని వివరించారు. జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడ అయితే గెలిచే అవకాశం ఉందో, ఆ నియోజకవర్గాలను హరిరామ జోగయ్య వెల్లడించారు. ఇవి ఏడు స్థానాలు ఉన్నాయి.

janasena loksabha candidates

తెలుగుదేశం పార్టీతో సీట్ల పంపకాలు విషయంలో చర్చలు జరిపి, ఈ ఏడు స్థానాలు దక్కించుకోవాలి అని చెప్పారు. ఇందులో కాపు, బలిజ సామాజిక వర్గాలకి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండే లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు నిలబడితే సరిగ్గా ఉంటుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, మచిలీపట్నం, తిరుపతి, నర్సాపురం, రాజంపేట ప్రాంతాల్లో లోక్ సభలో పోటీ చేయాలి అని చెప్పి, అభ్యర్థుల పేర్లను కూడా పేర్కొన్నారు. వారిలో,

# అనకాపల్లి – కొణిదెల నాగబాబు (కాపు)/బొలిశెట్టి సత్యనారాయణ (కాపు)/కొణతల రామకృష్ణ (గవర)

# కాకినాడ- సానా సతీష్ (కాపు), నర్సాపురం- మల్లినీడి తిరుమలరావు (కాపు)

# విజయనగరం – గెదెల శ్రీనివాస్ (తూర్పు కాపు)

# మచిలీపట్నం – వల్లభనేని బాలశౌరి (కాపు)

# తిరుపతి- వర ప్రసాద్ (ఎస్సీ), రాజంపేట- ఎస్ బాలసుబ్రహ్మణ్యం (బలిజ)

# నర్సాపురం- మల్లినీడి తిరుమలరావు (కాపు)

# రాజంపేట- ఎస్ బాలసుబ్రహ్మణ్యం (బలిజ)

వీరిని అభ్యర్థులుగా ప్రకటించాలి అని చేగొండి హరిరామ జోగయ్య సూచించారు.

ALSO READ : ఈ 4 ప్రభాస్ సినిమాలని రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అన్నారు.. కానీ తర్వాత సూపర్ హిట్ అయ్యాయి.!


End of Article

You may also like