Home Filmy Adda Janhvi Kapoor : మేకప్ ఆర్టిస్ట్ తో జాన్వీ కపూర్ గొడవ..! వీడియో వైరల్..!

Janhvi Kapoor : మేకప్ ఆర్టిస్ట్ తో జాన్వీ కపూర్ గొడవ..! వీడియో వైరల్..!

by Mohana Priya

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో జాన్వీ కపూర్ తన మేకప్ ఆర్టిస్ట్ రివేరా లిన్ తో గొడవ పడుతున్నారు.

ఈ వీడియోలో జాన్వీ కపూర్ రివేరా వైపు ఫుట్‌బాల్ తన్నడంతో రివేరాకి కోపం వచ్చి, “ఈ ప్రవర్తన ఏంటి?” అని అడుగుతారు. అందుకు జాన్వీ కపూర్ “పొరపాటున తాన్నాను” అని చెప్తారు. అందుకు రివెరా “ఈ ఫుట్‌బాల్ ని తీయి” అని జాన్వీతో అంటారు. వీరిద్దరికి మధ్య గొడవ జరగడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.

janhvi kapoor argues with her makeup artist

ఈ వీడియోని స్వయంగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసారు. దీనికి మళ్ళీ క్యాప్షన్‌గా “మేము ఎవరి సహాయం అయినా తీసుకోవాలి అని అనుకుంటున్నారా” అని రాసారు. కానీ ఈ వీడియో వెనుక కథ వేరే ఉంది. ఈ వీడియోలో జరిగినదంతా నిజం కాదు. ఇందులో జాన్వీ కపూర్ బిగ్‌బాస్ 5 హిందీ కంటెస్టెంట్ అయిన పూజా మిశ్రాని ఇమిటేట్ చేసారు. అందులో జరిగిన ఒక సీన్ ని జాన్వీ, రివేరాతో కలిసి లిప్ సింక్ చేసి అప్‌లోడ్ చేసారు. ఈ వీడియోపై ఎంతో మంది సెలబ్రిటీస్ కామెంట్ చేసారు.

watch video :

https://www.instagram.com/reel/CWyK9hjIrl3/?utm_source=ig_web_copy_link

You may also like