Home Filmy Adda “హీరోయిన్ అయ్యుండి… డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తారా..?” అంటూ… “జాన్వీ కపూర్” మీద కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“హీరోయిన్ అయ్యుండి… డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తారా..?” అంటూ… “జాన్వీ కపూర్” మీద కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by Sainath Gopi

భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈవో వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలలో పాల్గొనడం కోసం దేశ విదేశాల నుంచి ప్రముఖులు జామ్ నగర్ చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ రిహాన్నా తన పాటతో హుషారెత్తించింది. ఈ గ్లోబల్ సెన్సేషన్ తన బృందంతో కలిసి ఉర్రూతలూగించారు. ఆమెతో కలిపి బాలీవుడ్ నటి జాన్వీకపూర్ స్టెప్పులు వేశారు.

janhvi kapoor at ambani pre wedding celebration

రిహాన్నా తో పాటు జాన్వీ కూడా స్టేజ్ మీద డాన్స్ చేసి అదరగొట్టింది. పెళ్లి మొత్తం ఈమెదే అన్నట్లు ఎక్కడ చూసినా జాన్వీ తళుక్కుమని మెరిశారు. అంతవరకు ఓకే కానీ ఆ తర్వాత జాన్వీ చేసిన ఒక పని ఇప్పుడు పలువురికి ఆగ్రహం తెప్పించింది . డబ్బు కోసం ఏమైనా చేస్తావా అంటూ చివాట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

janhvi kapoor at ambani pre wedding celebration

అంబానీ కాబోయే కోడలు రాధిక మర్చంట్ పెళ్లికూతురుగా ముస్తాబయి నడుస్తూ వస్తూ ఉండగా పక్కనే కొందరు ఆమెపై పువ్వులు చల్లుతూ ఉన్నారు. మరికొందరు హారతులు పడుతున్నారు. ఈ క్రమంలోనే నటి జాన్వీ కపూర్ కూడా ఏకంగా హారతి పళ్లెం పట్టుకొని రాధిక మర్చంట్ నడుస్తూ వస్తున్నటువంటి తరుణంలో ఆమెకు హారతి ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

janhvi kapoor at ambani pre wedding celebration

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి కూతురు అలా చేయడం పట్ల నెటిజన్స్ షాక్ అయ్యారు, డబ్బు కోసం ఏమైనా చేస్తావా అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఆమె చేసింది తప్పు అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా జాన్వీ ని తప్పుపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆమెని సపోర్టు చేస్తున్నారు. ఆమె చేసిన పనిలో తప్పేముంది అంటూ వెనకేసుకుని వస్తున్నారు. టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

watch video :

You may also like