సినిమా పరిశ్రమలో అవకాశం రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పైకి రావడం ఇంకో ఎత్తు.అయితే సినీ పరిశ్రమలో అవకాశాలు లేక ఎంతోమంది ఎదురుచూస్తుంటారనే విషయం తెలిసిందే.అయితే స్టార్ డామ్ పొందిన నటీనటుల వారసులుగా పరిచయం అయ్యేవారిది మరొక కష్టం.ఎందుకంటే వారిమీద ఎక్సపెక్టషన్స్ తార స్థాయికి చేరుకుంటాయి కానీ వాటిని అందుకోలేక కొంతమంది స్టార్స్ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటారు.అయితే అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు .అయితే ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ ను నమ్మడం వలనే జాన్వీ కెరీర్ స్లో అయిందంట.ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్ద్దాం ..

నటి శ్రీ దేవి తన కూతురి కెరీర్ బాధ్యతను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కు అప్పగించారు.ఎందుకంటే ఇప్పటిదాకా కరణ్ జోహార్ పరిచయం చేసిన నటీనటులు పెద్ద స్థాయికి చేరుకోవడమే దానికి కారణం.అయితే జాన్వీ కపూర్ చేసే సినిమాల నిర్ణయాలన్నీ కూడా కరణ్ జోహార్ తీసుకుంటారు .అయితే 2018 లో విడుదల అయిన “ధఢక్” అనే చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్ తర్వాత “ఘోస్ట్ స్టోరీస్” అనే చిత్రంలో నటించాగా ఆ చిత్రం నెట్ ఫ్లిక్ లో విడుదల అయింది.

అయితే జాన్వీ నటించబోయే ఇంకొన్ని చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉన్నాయి.కానీ జాన్వీ కపూర్ కి ఇప్పటిదాకా పెద్ద సినిమాలలో అవకాశాలు ఏమి రావడంలేదు.మొదట్లో కొన్ని మంచి అవకాశాలు వచ్చిన కూడా కరణ్ జోహార్ వద్దు అని చెప్పడంతో ఆ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసారంట జాన్వీ కపూర్. మొదట్లో వదులుకున్న అవకాశాల వలనే జాన్వీ కపూర్ కెరీర్ స్లో అయింది అని నెటిజన్లు వినపడుతున్నాయి.