Ads
ఎక్కడైనా ఏ విషయమైనా అందరి దృష్టికి తీసుకు రావాల్సి ఉంటే, న్యూస్ మీడియా ఎంత ముఖ్యమో, సోషల్ మీడియా కూడా అంతే ముఖ్యం అయిపోయింది. అలా సోషల్ మీడియా ద్వారా ఎవరికైనా సహాయం కావాలి అని పోస్ట్ చేస్తే దానికి స్పందించి వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే, ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకోవడానికి కూడా సోషల్ మీడియా దారిలో వెళ్తున్నారు.
Video Advertisement
కానీ సోషల్ మీడియాలో క్లిక్ అవ్వాలి అని చేసే కొన్ని పనుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశాలు. అందుకు ఇటీవల జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ. బియర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదే ఫార్మాట్ లో కాంబోడియాకు చెందిన ఫౌన్ రాటీ అనే వ్యక్తి తన భార్య ఆహ్ లిన్ ట్యుక్ తో కలిసి యూట్యూబ్ లో నాచురల్ లైఫ్ టీవీ పేరు తో ఒక ఛానల్ క్రియేట్ చేసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగానే ప్రోగ్రాం చేయడం మొదలు పెట్టారు.
పక్షులు, కింగ్ కోబ్రా, కప్పలు, షార్క్ ల తో పాటు కొన్ని చాలా అరుదైన జాతులకు చెందిన అంతరించిపోతున్న జీవులని చంపి తిని సర్వైవల్ వీడియోస్ పేరుతో ఆ వీడియోస్ ని తమ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోస్ చూసిన వాళ్ళు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ప్రాంతం యొక్క పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఫౌన్ రాటీ, ఆహ్ లిన్ ట్యుక్ ని అరెస్ట్ చేశారు.
వాళ్ళిద్దరూ తాము కేవలం పాపులారిటీ, పేరు కోసం మాత్రమే ఇలా చేశామని, ఆ వీడియోల ద్వారా దాదాపు ఐదు వందల డాలర్లు సంపాదించామని చెప్పారు. అలా చేసినందుకు క్షమాపణలు చెప్పారు. యూట్యూబ్ యాజమాన్యం వాళ్ల ఛానల్ లో ఉన్న, ఫిర్యాదు చేసిన వీడియోలను తొలగించారు.
End of Article