గత ఏడాది రావలసిన ఎన్నో సినిమాలు కరోనా కారణంగా ఆలస్యం అయ్యాయి. అలా రిలీజ్ పోస్ట్పోన్ అయ్యి ఈ ఏడాది మన ముందుకు వచ్చిన సినిమా జాతిరత్నాలు. సినిమాలో ఉన్న లీడ్ యాక్టర్స్, అలాగే సినిమా నిర్మించేది వైజయంతి మూవీస్ సంస్థ కావడంతో జాతిరత్నాలు విడుదల అయ్యే ముందు నుంచే ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది.

jathi ratnalu proposal scene inspiration

ఇంక టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి. మార్చి 11వ తేదీన విడుదలైన జాతిరత్నాలు సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఈ సినిమాకి డైలాగ్స్ ఇంకా కామెడీ హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా కొత్త కొత్త ఐడియాస్ తో చాలా డిఫరెంట్ గా చేశారు.

watch video:

అల్లు అర్జున్, మహేష్ బాబు, నాని ఇంకా ఎంతో మంది ప్రముఖులు జాతిరత్నాలు సినిమాని, సినిమా బృందాన్ని అభినందించారు. అయితే ఈ సినిమాలో ప్రపోజల్ సీన్ చాలా వైరల్ అయ్యింది. కానీ దాదాపు ఇలాంటి ప్రపోజల్ సీన్ అంతకుముందు విడుదలైన ఒక వెబ్ సిరీస్ లో ఉంది. పైన కనిపించే సీన్ చాయ్ బిస్కెట్ వాళ్లు రూపొందించిన నేను మీ కళ్యాణ్ అనే వెబ్ సిరీస్ లోనిది. ఈ డైలాగ్ వినండి.

watch video:

ఈ సీన్ లోని డైలాగ్స్ అంతకుముందే విన్నాం కదా. ఇప్పుడు పైన ఉన్న సీన్ చూడండి. ఇది ఇటీవల విడుదలై సూపర్ హిట్ సాధించిన జాతిరత్నాలు సినిమాలోది. దాదాపు నేను మీ కళ్యాణ్ వెబ్ సిరీస్ లోని డైలాగ్స్ లాగానే ఉన్నాయి కదా. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE