Ads
కొన్ని సినిమాలు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ సినిమా టీవీ లో ఎప్పుడు టెలికాస్ట్ అయినా సరే అందరూ చాలా ఆసక్తిగా చూస్తారు. అలాంటి సినిమాల జాబితాలోకి చెందిన సినిమా అదుర్స్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డబల్ యాక్షన్ చేశారు.
Video Advertisement
ఒక ఎన్టీఆర్ కి జంటగా నయనతార నటించగా, ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ కి జంటగా షీలా నటించారు. ఈ సినిమాకి మేజర్ హైలైట్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంకా బ్రహ్మానందం గారికి మధ్య వచ్చే కామెడీ సీన్స్. చారి – భట్టు కాంబినేషన్ టెంప్లేట్స్ మనం సోషల్ మీడియాలో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.
watch video :
https://www.instagram.com/p/CMrjiH7pHkY/?igshid=1btm0qqytw9hg
అసలు ఏ సందర్భం అయినా సరే, ఎలాంటి మీమ్ అయినా సరే ఈ టెంప్లేట్ మాత్రం కచ్చితంగా సెట్ అవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఈ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో కొన్నివేల మీమ్స్ ఉంటాయి. ఇంకా వస్తాయి కూడా. అంతే కాకుండా బ్రహ్మానందం గారికి, నయనతారకి మధ్య వచ్చే ట్రాక్ కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అయితే ఇటీవల విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా జాతి రత్నాలు.
watch video :
https://www.instagram.com/p/CMyJ7vpJGRE/?igshid=1jyift0tomdt9
ఈ సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టికి, హీరోయిన్ ఫారియా అబ్దుల్లా కి మధ్య ఒక ప్రపోజల్ సీన్ ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సీన్ కి వచ్చే డైలాగ్స్ ని అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం గారికి, నయనతార కి మధ్య వచ్చే సీన్స్ కి సింక్ చేసి ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇందాక పైన చెప్పినట్టుగా అదుర్స్ సినిమాలోని చాలా టెంప్లేట్స్ ఏ సందర్భానికి అయినా సెట్ అవుతాయి. ఇప్పుడు ఇది కూడా అంతే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
watch video :
https://instagram.com/p/CMzKq4apPD0/
End of Article