ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) మాత్రమే రాణించినా బౌలర్ల సమష్ఠి దాడితో గురువారం జరిగిన ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై మూడు పరుగుల తేడాతో గెలిచింది. దీంతో వరుసగా మూడు విజయాలతో అజేయంగా నిలిచిన భారత్‌ ఇతర జట్లకన్నా ముందే సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది.

కివీస్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.దాంతో 134 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్‌ వరకూ కివీస్‌ పోరాడినా విజయాన్ని సాధించలేకపోయింది. చివరి ఓవర్‌లో కివీస్‌ విజయానికి 16 పరుగులు కావాల్సిన తరుణంలో ఆ జట్టు 11 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.

ఇక విజయం సాధించడంతో టీం ఇండియా ఫుల్ జోష్ లో ఉంది. ఈ క్రమంలో క్రికెటర్ జెమియా రోడ్రిగ్స్ ఆఫ్ డ్యూటీ సెక్యూరిటీ గార్డుతో కలిసి డాన్స్ చేసారు. కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ జంటగా నటించిన లవ్ ఆజ్ కల్ చిత్రంలో ‘హాన్ మెయిన్ గలాట్’ పాటకు డ్యాన్స్ చేసారు. క్రికెటర్ అయినా డాన్స్ అదరకొట్టేసింది జెమిమా. ఆ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో చూసినవారు అందరు ఫిదా అయిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

ఈ వీడియోపై హీరో కార్తీక్ స్పందించారు…‘ తన అభిమాన క్రికెటర్ హాన్ మెయిన్ గలాట్ పాటకు డ్యాన్స్ చేశారని చెబుతూ.. ప్రపంచకప్‌తో స్వదేశానికి తిరిగిరావాలని కోరారు. అంతేకాదు డాన్స్ చేసిన సెక్యూరిటీ గార్డును కూడా బాలీవుడ్ కి తీసుకొని రమ్మన్నారు”.

కివీస్ తో మ్యాచ్ లో భారత్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. అయినప్పటికీ ఆ స్కోరును కాపాడుకుని మరో గెలుపును అందుకోవడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. గ్రూప్‌ స్టేజ్‌లో భారత మహిళలు తమ చివరి మ్యాచ్‌ను శనివారం శ్రీలంకతో ఆడనున్నారు.శిఖా పాండే సూపర్‌ బౌలింగ్‌తో జట్టు గట్టెక్కింది.

If you want to contribute content on our website, click here

Cryptoknowmics
Sharing is Caring:
No more articles