Home Biography “జెర్సీ” సినిమాలో నటించిన ఈ అబ్బాయి రియల్ లైఫ్ తల్లితండ్రులు ఎవరో తెలుసా.?

“జెర్సీ” సినిమాలో నటించిన ఈ అబ్బాయి రియల్ లైఫ్ తల్లితండ్రులు ఎవరో తెలుసా.?

by Mohana Priya

ప్రతి హీరోకి తనలోని యాక్టింగ్ పొటెన్షియల్ కరెక్ట్ గా చూపించిన సినిమా ఒకటి ఉంటుంది. అలా నాచురల్ స్టార్ నాని కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా జెర్సీ. 2019 లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రిటిక్స్ ప్రశంసలను కూడా అందుకుంది. సాధారణంగా ఒక యాక్టర్ ఫీల్ అయిన ఎమోషన్ ని ప్రేక్షకులు ఫీల్ అయితే ఆ యాక్టర్ సక్సెస్ అయినట్టే.

jersey child artist ronit kamra

ఈ సినిమాలో నాని పోషించిన అర్జున్ పాత్ర బాధపడితే మనం కూడా బాధపడ్డాం. సంతోష పడితే మనం కూడా సంతోష పడ్డాం. ఇంక నాని పెర్ఫార్మన్స్ ఎలా ఉందో ఈ పాటికి మీకే అర్ధమైపోయి ఉంటుంది. ఈ సినిమాలో ఒక మేజర్ హైలెట్ నాని పర్ఫార్మెన్స్ అయితే, మరొక మేజర్ హైలైట్ నానికి వాళ్ళ కొడుకుకి మధ్య వచ్చే సీన్స్. నాని కొడుకు పాత్రలో నటించిన అబ్బాయి పేరు రోనిత్ కామ్రా.

jersey child artist ronit kamra

రోనిత్ కామ్రా ఢిల్లీకి చెందిన వాడు. జెర్సీ సినిమాలో నటించక ముందు ఫ్యాబ్ ఇండియా, హార్లిక్స్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, టప్పర్ వేర్ ఇంకా ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో నటించాడు. రోనిత్ తల్లి పేరు సోనియా కామ్రా. తండ్రి పేరు విపిన్ కామ్రా. వీరిది పంజాబీ కుటుంబం. అంత చిన్న వయసులో కూడా జెర్సీ సినిమాలో చాలా బాగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రోనిత్.

jersey child artist ronit kamra

జెర్సీ సినిమా ఇప్పుడు హిందీలో రూపొందుతోంది. ఇందులో హీరోగా షాహిద్ కపూర్, హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వీడియోలు కొంతకాలం క్రితం బయటికి వచ్చాయి. అందులో షాహిద్ కపూర్ తోపాటు రోనిత్ కూడా బైక్ మీద కూర్చుని ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే తెలుగులో రోనిత్ పోషించిన నాని పాత్రని హిందీలో కూడా రోనిత్ చేస్తున్నాడు అని తెలుస్తోంది. అంతే కాకుండా నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వస్తున్న రంగ్ దే సినిమాలో కూడా నటిస్తున్నాడు రోనిత్ కామ్రా.

jersey child artist ronit kamra

jersey child artist ronit kamra

 

images source : instagram/ronitkamra

You may also like