Ads
ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రతి చోటా నడిచేది నెపోటిజమ్ గురించే. అప్ కమింగ్ నటుల నుండి, స్టార్ నటుల వరకు సినిమా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ప్రతి వాళ్లని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ల సినిమాలు చూడము అని చెబుతున్నారు. ముఖ్యంగా ఆలియా భట్, అనన్య పాండే, ఆదిత్య పంచోలి కొడుకు సూరజ్ పంచోలి, అర్జున్ కపూర్ తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.
Video Advertisement
అలా సినిమా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వాళ్ళలో జాన్వీ కపూర్ ఒకరు. అతిలోక సుందరి శ్రీదేవి, బాలీవుడ్ లో టాప్ నిర్మాత బోనీకపూర్ కూతురైన జాన్వీకపూర్ 2 సంవత్సరాల క్రితం వచ్చిన మరాఠీ సూపర్ హిట్ చిత్రం సైరత్ రీమేక్ ధడక్ తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
సినిమా విడుదలైన తర్వాత జాన్వీ కపూర్ నటన ను అందరూ విమర్శించారు. అంతేకాకుండా కొంతమంది అయితే “నీ నటనను చూసేందుకు మీ అమ్మ లేకపోవడమే మంచిదయింది” అని వ్యక్తిగత విషయాలపై కామెంట్లు కూడా చేశారు.
తర్వాత ఘోస్ట్ స్టోరీస్ లో ఒక పాత్రలో నటించారు జాన్వీ కపూర్. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇందులో కూడా జాన్వీ కపూర్ నటన చాలా డల్ గా ఉంది అని విమర్శించారు.
ఇటీవల జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా సినిమా కూడా లాక్ డౌన్ కారణంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొంతమంది సినిమా బాగుంది కానీ జాన్వీ కపూర్ నటన ఇంకా మెరుగు పరుచుకోవాలి అని అన్నారు. మరికొంతమంది అయితే జాన్వీ కపూర్ ఇంప్రూవ్ అయింది అని ప్రశంసించారు.
దీనిపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ మొదటి సినిమాకి తన నటన పై ఎన్నో విమర్శలు వచ్చాయి అని, తనని తాను మెరుగుపరుచుకోవడానికి ఆ విమర్శలు ఒక అవకాశాన్ని ఇచ్చాయని అన్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ రూహి అఫ్జానా, దోస్తానా 2 చిత్రాల్లో నటిస్తున్నారు.
End of Article