Ads
ఒకప్పుడు తన అందంతో అభినయంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి. ఆమె కెరీర్లో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా మారాయి. తర్వాత తన కూతురు జాన్వి కూడా ఆమె బాటలో నడుస్తుంది. ఎన్నో సినిమాల్లో నటిస్తూ మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటోంది. అయితే జాన్వి గురించి చాలా మందికి ఈ విషయాలు తెలియవు.
Video Advertisement
సినిమా యాక్టర్లు సినిమాల్లో కనపడినట్లు కాదు. వాళ్ళ యొక్క జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వుంటారు. జాన్వి కపూర్ ప్రస్తుతం మలయాళ సినిమా హెలెన్ కు రీమేక్ గా వస్తున్న మిలీ సినిమాలో నటిస్తోంది.
అయితే ఆమె ఈ పాత్ర కోసం ఏడున్నర కేజీలు బరువు పెరగాల్సి వచ్చింది. దీంతో ఆమె శారీరకంగా మానసికంగా కూడా కుమిలి పోయిందట. ఈమె చేసిన క్యారెక్టర్ పై కలలు కూడా వచ్చేవట సరిగా నిద్రపోకపోవడంతో ఆరోగ్యం కూడా దెబ్బ తిందని చెప్పింది జాన్వీ. పైగా ప్రతి రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకున్నానని ఈమె అంది. అయితే జాన్వి తల్లి శ్రీదేవి ఇండస్ట్రీలో ఉండాలంటే నిరంతరం పని చేయాలని తనకు చెప్పేవారట అందుకే ఈమె ఎంతటి కష్టాన్ని అయినా పడుతుంది.
నిజాయితీగా అవిశ్రాంతంగా పని చేస్తే తప్పక ఫలితం ఉంటుందని ఈమె అనుభవాల్లో నేర్చుకున్నారట. అందుకే జాన్వీ సినిమా కోసం ఎంతటి కష్టం అయినా సరే చేస్తానని అంది. మిలీ సినిమా నవంబర్ నాలుగున విడుదల కానుంది. మైనస్ 16 డిగ్రీస్ చలి లో ఇరుక్కు పోయిన పాత్ర చేసింది జాన్వీ. రోజూ 15 గంటలు ఫ్రిడ్జ్ లో ఉంటూ… అక్కడ ఎలుక కరుస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని జాన్వీ ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాలని షేర్ చేసుకుంది.
End of Article