JANHVI KAPOOR: నోరు జారి నిజం చెప్పేసిన జాన్వి కపూర్.. ఎగిరి గంతేసిన కరణ్ జోహార్! ఏమైందంటే.?

JANHVI KAPOOR: నోరు జారి నిజం చెప్పేసిన జాన్వి కపూర్.. ఎగిరి గంతేసిన కరణ్ జోహార్! ఏమైందంటే.?

by Mounika Singaluri

Ads

శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ నటి గా తల్లి పేరుని నిలబెట్టే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయింది జాన్వి. ఇక తెలుగులో దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది జాన్వి. ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే ఈమె ఎక్కువగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

Video Advertisement

ఈమధ్య ఎక్కడ చూసినా వీళ్లిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారా అనే ప్రశ్నకు ఇద్దరూ స్పందించలేదు. అయితే ఈమధ్య జాహ్నవి కపూర్ చెల్లెలితో కలిసి బాలీవుడ్ టాప్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొంది. ఆ షో తాలుకా ప్రమో ఈ మధ్యనే రిలీజ్ అయింది. అందులో తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి నాలుక్కరుచుకుంది జాన్వి కపూర్.

ఇంతకీ ప్రోమోలో చూపించిన విషయం ఏమిటంటే నీ స్పీడ్ డయల్ లిస్టులో ఉన్న ముగ్గురు పేర్లు చెప్పు అంటూ కరణ్ ప్రశ్నిస్తే దానికి బదులిస్తూ జాన్వి ఇలా చెప్పింది. పప్పా, కుషు, షికూ అని చెప్పుకొచ్చింది. ఈ లిస్టులో మొదటి రెండు పేర్లు తండ్రివి కాగా మూడోది శిఖర్ పహరియాది అని తెలుస్తుంది. అయితే ఈ సమాధానం చెప్పిన తర్వాత జాన్వి బిహేవియర్ కూడా అర్రే నిజం చెప్పేసానే అన్నట్లు ఉండటంతో ఆ షో కి హోస్ట్ అయిన కరణ్ జోహార్ నవ్వుతూ ఎగిరి గంతులు వేసేసారు.

ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే దేవర జనవరి 8న మూవీ గ్లిప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మూవీ టీం. ఈ సినిమా రెండు పార్టీలుగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ని 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మూవీ టీం.

 


End of Article

You may also like