Ads
సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం బాలీవుడ్ అంతటా సంచలనం రేపుతోంది.సుశాంత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కొంతమంది బాలీవుడ్ ప్రముఖులే కారణం అంటూ పలు అభిప్రాయాలను వ్యక్తం అవుతున్నాయి.వివేక్ ఒబెరాయ్,కంగనా లాంటి వాళ్ళు బహిరంగంగానే బాలీవుడ్ లో ఉన్న చీకటి కోణం గురించి వ్యాఖ్యలు చేసారు.అయితే బాలీవుడ్ నటి జియా ఖాన్ తల్లి ఇప్పుడు సుశాంత్ మరణంపై మరియు బాలీవుడ్ హీరో అయిన సల్మాన్ ఖాన్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
అయితే గతంలో జియా ఖాన్ వివాదాస్పద రీతిలో చనిపోయిన విషయం తెలిసిందే.అయితే ఈ విషయాన్నీ మళ్ళీ తెరమీదకు తీసుకువచ్చారు జియా ఖాన్ తల్లి రబియా ఖాన్.జియా ఖాన్ చనిపోయిన సమయంలో సిబిఐ అధికారులు నన్ను లండన్ నుండి ఇండియా కు పిలిచారని అయితే ఆ సమయంలో సిబిఐ ఆఫీసర్స్ కు సల్మాన్ రోజు ఫోన్ చేసి సూరజ్ ను ఏమిచెయ్యదు అని అతని మీద బాగా పెట్టుబడి పెట్టాను అని చెప్పి తన డబ్బు పేరుతొ కేసు ను తప్పుదోవ పట్టించారని రబియా ఖాన్ అన్నారు.
అయితే ఈ విషయాన్నీ సిబిఐ ఆఫీసర్స్ నాతో వ్యక్తిగతంగా పంచుకున్నారని అన్నారు రబియా ఖాన్.కాగా సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం నన్ను చాల బాధించింది అని రాబోయే రోజులలో అయిన బాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితులు మారాలని రబియా ఖాన్ అన్నారు.కాగా సుశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు రబియా ఖాన్.
End of Article