నిన్నటి మ్యాచ్ లో రాహుల్ ని ఉద్దేశించి న్యూజీలాండ్ ప్లేయర్ నీషమ్ ట్విట్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాహుల్

నిన్నటి మ్యాచ్ లో రాహుల్ ని ఉద్దేశించి న్యూజీలాండ్ ప్లేయర్ నీషమ్ ట్విట్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాహుల్

by Megha Varna

Ads

నిన్న జరిగిన చివరి వన్డేలో భారత్ పై న్యూజిలాండ్ అయిదు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. రాహుల్ (112) శతకంతో మెరిశాడు. అయితే 20వ ఓవర్ లో రాహుల్ సింగిల్ కోసం ప్రయత్నించగా నీషమ్ అతడికి ఎదురుగా వచ్చాడు. దీంతో రాహుల్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయినా తర్వాత వెంటనే ఇద్దరూ నవ్వుకొన్నారు.న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. సరదా ట్వీట్లతో సందడి చేస్తుంటాడు. తాజాగా టీమ్ ఇండియా బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Video Advertisement

నిజంగా ఆ ఫోటో చూస్తే.. వాళ్లు గొడవ పడుతున్నట్లు ఉండదు.. ఈ పేపర్, సీజర్స్ ,రాక్స్ గేమ్ ఆడుతున్నట్లుగానే ఉంటుంది. అంతేకాకుండా.. రాహుల్ ని ట్యాగ్ చేస్తూ.. ఏప్రిల్ వరకు కొన్ని పరుగులు దాచిపెట్టుకో అంటూ మరో ట్వీట్ చేశాడు.అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో నీషమ్ ను పంజాబ్ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ లో కూడా రాహుల్ రాణించాలనే ఉద్దేశంతో నీషమ్ అలా ట్వీట్ చేశాడు.


End of Article

You may also like