Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఇటీవల విడదలయ్యి ట్రెండింగ్‌లో ఉంది.
ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసిన స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఈ పాట కోసం వారిద్దరు చాలా కష్టపడ్డారట. ఆ పాటలో హుక్ స్టెప్ సింక్ అవ్వడం కోసం 15- 18 టేక్స్ తీసుకున్నారట. ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, రాజమౌళి స్టెప్ రికార్డ్ చేసి, మళ్ళీ ఫ్రీజ్ చేసి, కెమెరా దగ్గరికి వెళ్లి కాళ్లు, చేతుల మూవ్మెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చూసుకునేవారట. పాట విడుదలైన తర్వాత రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది అన్నారు.
End of Article