Home Filmy Adda NTR 30 కి ముందు అనుకున్న “స్టార్ హీరో” అతనేనా..? ఆ హీరో ఈ సినిమా వదిలేయడానికి కారణమేంటి..?

NTR 30 కి ముందు అనుకున్న “స్టార్ హీరో” అతనేనా..? ఆ హీరో ఈ సినిమా వదిలేయడానికి కారణమేంటి..?

by Mohana Priya

జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ తన 39 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా అంతా ఎంతో మంది ప్రముఖ సెలబ్రెటీలు జూనియర్ ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నట్టు ప్రకటించిన రాబోయే సినిమాలకు సంబంధించి కొన్ని ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదల చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుంది అని ప్రకటించారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతుంది. ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

jr ntr is not the first choice for ntr 30 koratala siva movie

 

ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో నటిస్తారు. ఈ సినిమా పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో ముందు హీరోగా మరొక స్టార్ హీరోని అనుకున్నారు అని సమాచారం. దానికి సంబంధించి అంతకుముందు ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కొంతకాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు.

jr ntr is not the first choice for ntr 30 koratala siva movie

ఆ సినిమా పోస్టర్ కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పోస్టర్ కూడా అలాగే ఉంది. దాంతో బహుశా ఈ సినిమా అల్లు అర్జున్ హీరోగా అనుకున్న సినిమా అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు. ఈ సినిమా మాత్రం మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాదు అని కొరటాల శివ చెప్పారు. ఇందులో యాక్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది అని సమాచారం.

You may also like